ఇకపై బ్యాంకు చెక్స్ సంబంధించి మారుతున్న రూల్స్..! అవేంటంటే..?!

ఈ మధ్యకాలంలో బ్యాంకుకు సంబంధించిన విషయాలలో అనేకమంది మోసపోవడం గమనిస్తూనే ఉన్నాం.ఇందులో భాగంగానే కొందరు నకిలీ చెక్కుల ద్వారా కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వారు కూడా ఉన్నారు.

 Rbi New Rules For Cheque Payments, Changing Rules,bank Checks, January 1st, New-TeluguStop.com

ప్రస్తుతం మన దేశంలో రోజుకు ఎక్కడో ఒక చోట ఆయన అసలే నకిలీ చెక్కులతో ఆర్ధిక నేరగాళ్లు వారి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.అయితే ఈ మోసపూరిత సంఘటనలకు చెక్ చెప్పేందుకు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 1 నుంచి కొత్త పద్ధతులను అమలులోకి తీసుకురా బోతుంది.ఇందులో భాగంగానే ఇకపై 50 వేల కన్నా ఎక్కువ డబ్బులు చెల్లించే లావాదేవీలకు సంబంధించిన విషయాలలో బ్యాంకులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘పాజిటివ్ పే సిస్టమ్’ గా పేరు పొందిన ఈ కొత్త విధానాన్ని ఆర్బీఐ అమల్లోకి తీసుకరాబోతుంది.ఇక ఈ సిస్టమ్ సంబంధించిన రూల్స్ ఓ సారి చూస్తే… మొదటగా ఈ కొత్త పద్ధతి ప్రకారం 50 వేల రూపాయలకు పైబడి చెక్ ఎవరికైనా ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పని సరి అని ఆర్బిఐ అధికారాలకు రూల్స్ జారీ చేయనుంది.ఇందులో భాగంగా ఖాతాదారుడు అభీష్టానుసారం చేయవలసి ఉంటుంది.

ఇకపోతే 5 లక్షలకు మించి ఏదైనా చెల్లింపులు కలిగిన చెక్ కు మాత్రం ఈ రూల్స్ ను తప్పనిసరి చేసింది ఆర్బిఐ.

Telugu Bank, Bank Customers, Fraud Cheques, January, Pay System, Rbi Cheque-Late

అలాగే చెక్ ఇచ్చేవారు కూడా పాజిటివ్ పే సిస్టమ్ వలన బ్యాంకు కు సదరు చెక్ సంబంధించిన మినిమం డీటెయిల్స్ ను ఆ ఖాతా దారుడు వివరించాల్సి ఉంటుంది.ఇందులో భాగంగా ఆ చెక్ ఎవరికి జారీ చేశారు, అలాగే ఏ తేదికి జారీ చేశాడు, ఎంత డబ్బులు తీయాలనుకున్నారు, లాంటి వివరాలను డిజిటల్ వ్యవస్థ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.ఇక ఈ చెక్ సంబంధించి వివరాలను బ్యాంకు అధికారులు చెక్ చేసి పాజిటివ్ పే సిస్టమ్ ద్వారా ఆ చెక్ పై ఎలాంటి సరైన వివరాలు లేకపోయినా సరే ఆ చెక్ కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇకపోతే ఈ కొత్త విధానం రూల్స్ సంబంధించి బ్యాంకు కస్టమర్లకు మెసేజ్ లేదా ఇ-మెయిల్ ద్వారా పూర్తి వివరాలను చేరవేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.జనవరి 1 నుండి ఈ పద్ధతికి సంబంధించి అనుగుణంగా వివరాలు ఉంటేనే వారికి మాత్రమే సంబంధించిన మొత్తం క్లియర్ అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube