RBI ఈ సరికొత్త పథకానికి ఎన్నారైలు ఫిదా...!!

భారత్ నుంచీ ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన ఎంతో మంది ఎన్నారైలు స్వదేశంలో లేదా స్వ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.అయితే ఎన్నారైలు ఎప్పుడూ దీర్హకాలిక పెట్టుబడుల వైపే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు ఎందుకంటే వారికి 5 లేదా 10 ఏళ్ళ లో తాము పెట్టిన పెట్టబడులు వెనక్కి వచ్చేయాలని ఉండదు కాబట్టి అధిక శాతం మంది దీర్ఘకాలిక ప్రయోజనాలవైపే దృష్టి పెడుతుంటారు.

 Rbi Introduces New Retail Bond Scheme For Nri-TeluguStop.com

అయితే పలు నిభంధనల కారణంగా ప్రభుత్వ , ప్రవైటు రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు వారికి కొన్ని ఇబ్బందులు రావడంతో వేరే మార్గాలవైపు చూస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ మదుపర్ల కోసం ఇటీవల ప్రారంభించిన సరికొత్త పధకం వైపు ఎన్నారైలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంటున్నారు.

కేంద్ర బ్యాంక్ ప్రారంభించిన ఈ పధకంలో ఎన్నారైలు భారత్ రాకుండానే అక్కడే ఉంటూ ఎన్ఆర్ఓ బ్యాంక్ ఎకౌంటు ద్వారా బాండ్లు కొనుగోలు చేయవచ్చు.ఎక్కువ మంది ఎన్నారైలు ఈ పధకం వైపు ఆకర్షించబడటానికి కారణం కూడా లేకపోలేదు.

భారత్ లో ఉండే తమ ఆస్తుల సంరక్షణకు, వారి తల్లి తండ్రుల ఖర్చులకు ఈ సరికొత్త పధకంలో పెడుతున్న పెట్టుబడులు ఎంతగానో ఉపయోగపడుతాయని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

అమెరికా మొదలు, బ్రిటన్, సింగపూర్ దుబాయ్ లలో ఉండే భారతీయులు ఎక్కువగా ఈ పెట్టుబడుల వైపు ఆకర్షించబడుతున్నారట.

విదేశాలలో ఉంటూనే ఎకౌంటు ఓపెన్ చేసి ఈ బాండ్లు కొనుగోలు చేయవచ్చు, భారత ప్రభుత్వ బాండ్ల పై 6 నుంచీ 7 శాతం రాబడి ఉండటంతో ఈ పదకంవైపు ఎన్నారైలు ఆకర్షితులు అవుతున్నారని తెలుస్తోంది.అయితే స్వల్ప కాలిక విధానంలో రిస్క్ లు కూడా ఉంటాయాని , దీర్ఘ కాలిక విధానంలో రిస్క్ ఉండదు కాబట్టి ఈ ప్రధాన కారణంగానే ఎన్నారైలు ఈ సరికొత్త పధకం వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube