బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త.. ఇకపై అన్ని వేళలా ఆర్టీజీఎస్ సేవలు...!

భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా బ్యాంకు కస్టమర్లకు శుభవార్తను తెలిపింది.నగదు బదిలీకి సంబంధించిన ఆర్టీజీఎస్ సేవలను ఇక 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతోంది.

 Rbi, Key Decision, Rtgs, Neft, Upi, Bank Transtions, December-TeluguStop.com

అయితే ఈ విషయంకి సంబంధించి డిసెంబర్ నెల నుండి పూర్తిగా అమలులోకి తీసుకు రాబోతున్నట్లు ఆర్.బి.ఐ బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం ఈ రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ సేవలు కేవలం బ్యాంకు పనిదినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

అయితే ఆ తరువాత ఎవరికైనా డబ్బు సహాయం అవసరమైతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక ఈ విషయంపై ఆర్బీఐ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

రాబోయే డిసెంబర్ నెల నుండి 24 * 7 ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది.ఇకపోతే మనకు బ్యాంకు అకౌంట్ నుంచి ఎవరికైనా డబ్బులు పంపించాలంటే మొత్తం నాలుగు పద్ధతులలో ఏదో ఒక విధానం ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

ఇందులో యూపీఐ, ఎన్ఈఎఫ్ టి, ఆర్టీజీఎస్, ఐఎమ్ పిఎస్ విధానాల ద్వారా మనం ఇతరులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

Telugu Bank, December, Key, Neft, Rtgs-Latest News - Telugu

ఇకపోతే ఈ విధానాలలో యూపీఐలో కేవలం కొద్ది మొత్తంలో మాత్రమే డబ్బులను ట్రాన్స్ఫర్ చేయవచ్చు అలాగే ఎన్ఈఎఫ్ టి లేదా ఆర్టీజీఎస్ సేవలు కేవలం బ్యాంకు సమయాల్లో మాత్రమే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.ఇక అలాగే ఐఎమ్ పిఎస్ విధానం ద్వారా ఎప్పుడైనా డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాకపోతే అందుకు కాస్త ఎక్కువ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.అదే పెద్ద మొత్తంలో డబ్బును డ్రా చేసేందుకు మనం ఆర్టీజీఎస్ పద్ధతిని ఉపయోగిస్తాము.

రెండు లక్షల నుండి ఆ పై ఉన్న పెద్ద మొత్తాలను ఇతర అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.ఇది కేవలం బ్యాంకు నడిచే సమయంలో మాత్రమే నగదు బదిలీ చేయవచ్చు.

ఈ విషయాన్ని తాజాగా ఆర్బీఐ అన్ని వేళలా ఉంచేందుకు డిసెంబర్ నెల నుంచి సవరించబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube