లాక్‌డౌన్ కారణంగా ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. మూడు నెలలపాటు నో ఈఎంఐ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.ఈ కారణంగా అన్ని రంగాల వ్యాపారాలు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Rbi Announces 3 Months Moratarium On All Emi Installments-TeluguStop.com

అయితే కొన్ని రంగాలకు చెందిన ఉద్యోగులకు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా, అది కేవలం ఐటీ రంగానికి మాత్రమే వర్తించింది.దీంతో మిగతా వారు ఉపాధి లేక ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

భారత ఆర్ధిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించింది.దీంతో ఆర్‌బీఐ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది.

రెపోరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ, రివర్స్ రెపోరేటును 90 పాయింట్లకు తగ్గించింది.దీంతో రెపోరేటు 4.4 శాతం, రివర్స్ రెపోరేటు 4 శాతానికి చేరుకుంది.కాగా ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాలను ప్రకటించారు.

అటు భారతదేశ ఆర్ధిక స్థిరత్వానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కాగా ఆర్‌బీఐ తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలలో అన్ని రకాల ఈఎంఐ‌లపై మూడు నెలల మారిటోరియం విధించింది.

అటు బ్యాంకు సీఆర్ఆర్‌ను 100 బేసిస్ పాయింట్లకు తగ్గించగా అది 3 శాతానికి చేరుకుంది.ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో సగటు మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట లభించిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube