రాయపాటి కోడలిని విచారించనున్న పోలీసులు...కారణం!

ఇటీవల ఏపీ లోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

 Police Interrogating Rayapati Mamata About Swarna Palace Incident, Rayapati Rang-TeluguStop.com

అయితే రమేష్ హాస్పటల్ ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ లో కరోనా రోగుల చికిత్స జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో రమేష్ హాస్పటల్ యాజమాన్యం నిర్లక్ష్యం అలానే స్వర్ణ ప్యాలెస్ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తున్న నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ రమేష్ ను విచారించాలని ప్రయత్నించారు.

అయితే ఘటన తరువాత ఆయన విచారణకు హాజరు కాకుండా ప్రస్తుతం పరారీ లో ఉండడం తో ఆ ఆసుపత్రికి చెందిన పది మంది డాక్టర్స్ కు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో గుంటూరు రమేష్ హాస్పటల్ లో చీఫ్ ఆపరేటర్ గా ఉన్న డాక్టర్ రాయపాటి మమత ను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే గతంలో నోటీసులు జారీ చేయగా ఇప్పుడు తాజాగా ఆమెను విచారించడం కోసం గుంటూరు నుంచి విజయవాడ తరలించినట్లు తెలుస్తుంది.రాయపాటి మమత మాజీ ఎంపీ రాయపాటి కోడలు కావడం తో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.

స్వర్ణ ప్యాలెస్ ఘటన తరువాత ఆమెకు కూడా నోటీసులు ఇవ్వగా అయితే ఇటీవల ఆమె కరోనా బారిన పడి కోలుకోవడం తో ఇప్పుడు ఆమెను విచారించనున్నట్లు సమాచారం.

అయితే మరోపక్క రాయపాటి రంగారావు దీనిపై స్పందిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని,అసలు ఈ ప్రమాద ఘటనకు గుంటూరు రమేష్ హాస్పటల్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ విచారణను మరింత వేగవంతం చేశారు.అటు రమేష్ హాస్పటల్ యాజమాన్యం కానీ,స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం కానీ అందుబాటులో లేకపోవడం తో దొరికిన లింకుల ప్రకారం విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.

ఈ విచారణలో ఎలాంటి కీలక విషయాలు బయటపడతాయో చూడాలి.

ఇటీవల రమేష్ హాస్పటల్ కోవిడ్ సెంటర్ ఆయిన స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఘటనసమయంలో 40 మంది ఉండగా వారిలో 10 మంది మృతి చెందారు.అయితే ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా అక్కడ కోవిడ్ సెంటర్ రన్ చేస్తున్నారు అంటూ అభియోగాలు నమోదు కావడం తో ఈ ఘటన పై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube