Rayalaseema ycp : న్యాయ రాజధాని పేరుతో రాయలసీమ వాసులను మోసం!

Rayalaseema Residents Cheated In The Name Of Legal Capital , Rayalaseema , Legal Capital, Kurnool , Ycp, Ys Jagan, Sajjala Rama Krishna Reddy , Buggana Rajendranath, Tdp, Amaravthi, Vishakapatnam

అందమైన అబద్దాలతో, అందరూ నిజమేనేమో అనుకునేలా విద్వేషపు విషాన్ని కుమ్మరించి, సమాజాన్ని,ప్రాంతాలను నిలువునా చీల్చి రాజకీయ లబ్ది పొందడమే ఎజెండాగా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.ఉద్దేశపూర్వకంగానే ప్రాంతాల మధ్య ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారు.

 Rayalaseema Residents Cheated In The Name Of Legal Capital , Rayalaseema , Leg-TeluguStop.com

ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి మంటలు రేకెత్తించి, ఆ భావోద్వేగాన్ని ఓట్ల రూపంలో మరోసారి మలచుకోవాలని పాలక వైసిపి చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ప్రతిఘటిస్తున్నారు.మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని చూపించేందుకు కర్నూలులో వైసిపి నాయకులు నిర్వహించిన రాయలసీమ గర్జనలో వైసిపి నాయకులు తప్ప,ప్రజలు కనిపించలేదు.

ఆ మధ్య స్వయంగా విశాఖే రాజధాని అంటూ వైసీపీ నాయకులు చేసిన హడావుడిని విశాఖ వాసులు కూడా పట్టించుకోలేదు.తర్వాత లక్షలాది మందితో విశాఖలో పాదయాత్ర చేస్తామని ప్రకటించగా పదివేల మంది కూడా రోడ్డు పైకి రాలేదు.

వైసిపి నాయకుల ఉత్తరాంధ్ర గర్జన పిలుపు కూడా విశాఖ సిటీ దాటలేదు.ఇప్పుడు కర్నూలు లో న్యాయ రాజధాని అంటూ వైసిపి నాయకులు మరోసారి గర్జించినా కర్నూలు పొలిమేర దాటి వినపడలేదు.

ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల, ఆర్ధిక మంత్రి బుగ్గన వంటి పెద్దలు దగ్గరుండి గర్జన ఏర్పాట్లు పర్యవేక్షించి ప్రజల వద్దకు వేలాది బస్సులను పంపినా జనం రాలేదు.సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను రోడ్లపైకి తెచ్చారు.

ప్రతి పొదుపు సంఘం నుంచి ఐదారుగురు గర్జనకు హాజరు కావాలని, రాకపోతే రుణం రాదని, రాకుంటే వంద రూపాయల ఫైన్‌ తప్పదని హెచ్చరించినా లక్షమంది వస్తారని ఆశించినా 15 వేలకు మించి రాలేదని సమాచారం.గర్జన మైదానంలోవిద్యార్థులు, మహిళలు తప్ప ప్రజలు, వైసీపీ శ్రేణులు ఎవ్వరు లేరు.

అంతే కాదు వచ్చిన వారు కూడా నాయకుల ప్రసంగాలు మొదలు కాగానే విద్యార్థులు, డ్వాక్రా మహిళలు సభ నుంచి బయటకు వెళ్లిపోతుంటే ప్రధాన ద్వారం వద్ద వైసీపీ శ్రేణులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొందరు విద్యార్థులు గోడలు దూకి బయటకు వెళ్లి పోవడం గమనార్హం.

రాజధాని కానీ, హైకోర్టును కానీ రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసే హక్కు రాయలసీమ ప్రజలకు ఉంది.

తప్పులేదు.మరి ఒకపక్కన హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూలుకు మార్చడం లేదని ప్రభుత్వ న్యాయవాదితో సుప్రీం కోర్టు కు చెప్పించిన ప్రభుత్వం మరోపక్క రాయలసీమలో హైకోర్టు కోసం అంటూ గర్జనలు చెయ్యడం ఏమిటి?మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొన్నవారు మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని చెప్పడానికి గర్జనలు చెయ్యడం ఎవరిని మోసం చెయ్యడానికి? గర్జనలు చేస్తూ గాలి మాటలు చెబుతూ రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు.వైసిపి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే ఎవరు అడ్డుకున్నారు.

Telugu Amaravthi, Kurnool, Rayalaseema, Sajjalarama, Vishakapatnam, Ys Jagan-Pol

దేశ అత్యున్నత న్యాయస్థానంలో అమరావతి నుంచి హైకోర్టు మారదని చెప్పించి మళ్లి సీమ గర్జనలు ఎందుకు చేస్తున్నారు? కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబు కు ఇష్టం ఉందా లేదా అని మంత్రి బుగ్గన డిమాండ్ చేశారు.మరి 150 మంది ఎమ్మెల్యేల బలం వున్న ప్రభుత్వానికి చంద్రబాబు ఇష్టం లేకపోతె ఆగుతుందా? మూడు రాజధానులు బిల్లు చంద్రబాబు వ్యతిరేకిస్తే మూడు రాజధానుల బిల్లు పెట్టకుండా ప్రభుత్వం ఆగిందా?ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబు పై నెట్టడం ఏమిటి? కర్నూలు లో హైకోర్టు పెట్టకుండా ఎవ్వరు అడ్డుకొన్నారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి.

Telugu Amaravthi, Kurnool, Rayalaseema, Sajjalarama, Vishakapatnam, Ys Jagan-Pol

కర్నూలు లో హైకోర్టు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పై వైసిపి నాయకులు గర్జించాలి తప్ప,తెలుగుదేశం నాయకులు పై గర్జించడం ఏమిటి? గత నెలలో కర్నూలు జిల్లా లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలకు ప్రజలు పోటెత్తడంతో వైసీపీ నాయకత్వానికి కళ్ళు భైర్లు కమ్మి,కాళ్ళ కింద భూమి కదిలి పోయి దిక్కుతోచక ఆర్త నాధాలు చేస్తూ చంద్ర బాబు సభల కంటే తమ సభకు అధికంగా జనం వచ్చారని ప్రచారం చేసు కోవడానికి రాయలసీమ గర్జన సభ పెట్టారు.పాలనలో విఫలమై వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు టక్కు టమారా విద్యలు ప్రదర్శిస్తున్నారు.రాయలసీమలో నిర్వహించిన గర్జన సీమ ప్రయోజనాల కోసం కాదని, తమ ఉనికిని చాటుకునేందుకు చేపట్టిన వైసీపీ గర్జన అని అర్ధం అయింది.

దేశ అత్యున్నత న్యాయస్థానంలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నవారు.హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది తో సుప్రీం కోర్టుకు చెప్పించిన వారు మళ్ళి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం అంటూ ఎందుకు గర్జన చేశారో, ఎవరిని మభ్యపెట్టడానికో మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పగలరా.

రాయల సీమ అభివృద్ధి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న వైసిపి నాయకులు మూడున్నరేళ్ల సీఎం జగన్‌ పాలనలో రాయలసీమ కు చేసింది ఏమిటో చెప్పగలరా? ఒక్క ప్రాజెక్టూ అయినా పూర్తి చేసారా?ఒక్క పరిశ్రమను అయినా తీసుకొచ్చారా? రాయలసీమలో సీమలో వున్న పరిశ్రమలను తరిమేస్తున్నారు.అధికారంలో ఉండి చేసిందేమిటో చెప్పకుండా సీమ గర్జన పేరుతో బల ప్రదర్శనలు చెయ్యడం ఏమిటి?మూడున్నరేళ్లుగా రాయలసీమను గాలికి వదిలేసిన వారు సీమ ద్రోహులు మీరు కాదా?ఆర్థిక శాఖ మంత్రి సీమ గర్జనకు రాని వారందరూ రాయలసీమ ద్రోహులు అన్నారు.మరి రాయలసీమ అభివృద్ధిని గాలికి వదిలేసి న్యాయ రాజధాని పేరిట రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్న వారు ద్రోహులు కారా? ప్రతి పక్షంలో ఉండగా రాయల సీమలో సాగునీటి ప్రాజెక్టులు అన్నిపూర్తిచేసి సస్యశ్యామలం చేస్తామని జలకధలు చెప్పిన జగన్ రెడ్డి మూడున్నరేళ్లుగా రాయలసీమలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తీ చేశారు? మూడున్నరేళ్లుగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి ఉందా?జగన్ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా కుదేలు అయింది.హంద్రీ-నీవా-సుజల స్రవంతి,గాలేరు-నగరి-,వెలిగొండ, స్వర్ణ ముఖి,గుండ్రేవుల,గండికోట రిజర్వాయరు,వేదవతి ఎత్తిపోతల పధకం,ఆర్డీఎస్ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులు గాలిలో దీపాలు చేశారు.

స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు.రాయలసీమలో మూడున్నరేళ్లుగా ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తీ చెయ్యని కారణంగా వ్యవసాయం గాలిలోదీప మై పనులులేక ప్రజలు వలస పోతున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వ లేదు.బడ్జెట్ లో నిధులు కేటాయింపులే తప్ప ప్రాజెక్టుల పూర్తికి రూపాయికి కూడా విడుదల చేయడంలేదు.ఫలితంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి.మూడేళ్ళపరిపాలనలో రూ 6 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు పప్పుకూడు తినిపిచ్చారు తప్ప, ఎక్కడా కొత్తగా చుక్కనీరు కాలువల్లోనీళ్ళు పారి కొత్తగా ఒక్క ఎకరం సాగులోకి వచ్చిన దాఖలాలు లేవు.

తెచ్చిన అప్పులలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ 50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే రాయలసీమ సస్య శ్యామలం అయ్యేది.ఏది ఏమైనా కర్నూలులో వైసిపి నిర్వహించిన రాయలసీమ గర్జన కార్యక్రమం సీమ ప్రయోజనాల కోసం కాదని, తమ ఉనికిని చాటుకునేందుకు చేపట్టిన వైసీపీ గర్జన అని అర్ధం అయింది.

కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు అంశంలో రాయలసీమ వాసులను మోసం చేస్తూ గర్జనలు చెయ్యడం ఏమిటి? అందమైన అబద్దాలతో, అందరూ నిజమేనేమో అనుకునేలా విద్వేషపు విషాన్ని కుమ్మరించి, సమాజాన్ని,ప్రాంతాలను నిలువునా చీల్చి రాజకీయ లబ్ది పొందడమే ఎజెండాగా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube