ప‌చ్చి ఉల్లిపాయ తింటే ఆ శ‌క్తి పెరుగుతుంద‌ట‌..తెలుసా?

ఎక్క‌డో, ఎప్పుడో చైనాలో పురుడు పోసుకున్న క‌రోనా వైర‌స్.ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 Raw Onion Immunity Power Latest News Health Tips Health-TeluguStop.com

ఈ మ‌హ‌మ్మారి ఉచ్చులో ప‌డి ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోగా.ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి.

మ‌రోవైపు కోట్ల మంది ఈ వైర‌స్‌తో పోరాటం చేస్తూనే ఉంటాయి.అయితే ఈ మాయ‌దారి క‌రోనా వైర‌స్ నుంచి త‌మ‌ను ర‌క్షించుకోవాలంటే.

 Raw Onion Immunity Power Latest News Health Tips Health-ప‌చ్చి ఉల్లిపాయ తింటే ఆ శ‌క్తి పెరుగుతుంద‌ట‌..తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఖ‌చ్చితంగా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండాలి.అందుకే క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌తి రోజు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌ర‌చ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు ముఖ్య పాత్ర‌లు పోషిస్తుంటాయి.అలాంటి వాటిలో ఉల్లిపాయ‌లు కూడా ఉన్నాయి.అందులోనూ ప‌చ్చి ఉల్లిపాయలు ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా పెంచ‌గ‌ల‌వు.అవును, అంద‌రి ఇళ్ల‌ల్లోనూ విరి విరిగా ఉప‌యోగించే ఉల్లిలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్, విటమిన్ సి, విట‌మిన్‌ బి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నిండి ఉంటాయి.

Telugu Benefits Of Raw Onion, Corona Virus, Covid-19, Good Health, Health, Health Tips, Immunity Power, Latest News, Raw Onion-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అంతేకాదు, ఉల్లిలో ఐదు రకాలైన ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి.ఇవి రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంతో పాటు కొత్త క‌ణాల‌ను నిర్మించేందుకు కూడా స‌హాయ‌ప‌డ‌తాయి.అయితే ఉల్లిని వేయించి లేదా ఉడికించి తీసుకోవ‌డం కంటే.ప‌చ్చిగా తీసుకోవ‌డం వ‌ల్లే వేగంగా ఇమ్యూనిటీ ప‌ర‌వ్ పెరుగుతుంది.అందుకే ప‌చ్చి ఉల్లిని డైరెక్ట్‌గా తీసుకోవ‌డం, స‌లాడ్స్ రూపంలో తీసుకోవ‌డం, పెరుగుతో పాటుగా తీసుకోవ‌డం చేస్తే మంచిది.

Telugu Benefits Of Raw Onion, Corona Virus, Covid-19, Good Health, Health, Health Tips, Immunity Power, Latest News, Raw Onion-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇక ప‌చ్చి ఉల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా ప‌చ్చి ఉల్లిని డైట్‌లో చేర్చుకుంటే.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ద‌గ్గు, జులుబు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.కీళ్ల నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.మ‌రియు క్యాన్స‌ర్ క‌ణాలు కూడా వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

#Health #Corona Virus #COVID-19 #Raw Onion #BenefitsOf

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు