కన్నెగంటి రాఘవన్ పాత్ర‌లో రావుర‌మేశ్‌.. కేజీఎఫ్‌-2తో మ‌రో మైల్ స్టోన్‌..!

ఆయ‌న ఏ పాత్ర చేసినా అందులో త‌న‌దైన మార్కు ఉంటుంది.ఎమోష‌న‌ల్ అయినా, లేదా కామెడీ అయినా, యాక్ష‌న్ సీన్ అయినా ఆయ‌న ఉంటే ఆ వెర్ష‌న్ వేరే లెవెల్ లో ఉంటుంది.

 Ravuramesh In The Role Of Kanneganti Raghavan .. Another Milestone With Kgf-2 ..-TeluguStop.com

ఆయ‌నే రావు ర‌మేశ్‌.టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా ఆయ‌న ప్ర‌స్థానం సాగుతోంది.

రావు గోపాల్ వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగుతున్నారు.

రావుర‌మేశ్ ను ఒక పాత్ర‌కు ప‌రిమితం చేయ‌లేము.

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయ‌డంలో ఆయ‌న‌ది స‌ప‌రేటు స్టైల్‌.సినిమాలో వెయిట్ ఉన్న ఎమోష‌న‌ల్ సీన్స్‌ను చేయాలంటే ర‌మేశ్ త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నేంత‌గా ఆయ‌న జీవిస్తుంటారు పాత్ర‌ల్లో.అలాంటి ఆయ‌న ఇప్పుడు ఓ సెన్సేష‌న‌ల్ ప్రాజెక్టులో చేస్తున్నాడు.

అదేనండి మోస్ట్ వాంటెడ్ వెయిటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న కేజేఎఫ్‌-2లో.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మొద‌టి పార్టు కేజీఎఫ్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిదే.ఇందులో య‌శ్ హీరోగా న‌టిస్తున్నాడు.

అయితే సెకండ్ పార్టులో ఐదు భాష‌ల‌కు సంబంధించిన న‌టులు ఇందులో చేస్తున్నారు.

ఈరోజు రావు ర‌మేశ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కేజీఎఫ్-2 మూవీ టీమ్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

కేజీఎఫ్ టైమ్స్ పేప‌ర్ లో రావు ర‌మేశ్‌గురించి వ‌చ్చిన వార్త‌ను ఆ పోస్ట‌ర్‌లో ఉంచారు.ఇక ఈ మూవీలో కన్నెగంటి రాఘవన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు.

ఒక ఇన్వెస్టిగేష‌న్ సీబీఐ ఆఫ‌స‌ర్ గా రావు ర‌మేశ్ మెప్పించ‌బోతున్నారు.మొద‌టి సినిమాకు కొన‌సాగింపుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పోస్ట‌ర్లు, టీజ‌ర్ ఇప్ప‌టికే రికార్డులు క్రియేట్ చేసింది.

ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ షూటింగ్ జ‌రుగుతోంది.అయితే క‌రోనా కార‌ణంగా కాస్త ఆల‌స్యం అవుతోంది.

మ‌రి అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube