కండలు చూపిస్తున్న రవితేజ... నెక్స్ట్ సినిమా కోసమేనా  

Raviteja Work Out Pics Goes Viral - Telugu Crack Movie, Goes Viral, Raviteja Work Out Pics, South Cinema, Tollywood

టాలీవుడ్ లో మాస్ మహారాజ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న స్టార్ హీరో రవితేజ.అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు.

Raviteja Work Out Pics Goes Viral

ఇక రాజా ది గ్రేట్‌తో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ తరువాత గాడి తప్పాడు.ప్రస్తుతం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా షూటింగ్‌ని రవితేజ పూర్తి చేశాడు.

రవితేజ కెరియర్ లో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా తెరకెక్కుతుంది.

గతంలో తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను గోపిచంద్‌ మలినేని, రవితేజ కెరియర్ లో రెండు హిట్స్ వచ్చాయి.

ఈ నేపధ్యంలో గోపిచంద్ కి మళ్ళీ హిట్ లేకపోయినా రవితేజతో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకు క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇక ఈ సినిమా కోసం రవితేజ ఫిట్‌ నెస్ మీద దృష్టిపెట్టారు.

ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇప్పటికే రవితేజ సిక్స్ ప్యాక్ కోసం చూపించాడు.

దీని కోసం జిమ్ లో వర్క్ అవుట్స్ గట్టిగా చేస్తున్నారు.రవితేజ వర్క్‌ అవుట్స్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.5 కేజీల డంబుల్‌తో వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న రవితేజ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raviteja Work Out Pics Goes Viral Related Telugu News,Photos/Pics,Images..

footer-test