మరోసారి ఆ బ్యూటీతోనే రొమాన్స్ అంటోన్న మాస్ రాజా!  

Raviteja To Romance Tamannaah In Next Movie - Telugu Krack, Nakkina Trinadha Rao, Raviteja, Shruti Hassan, Tamannaah, Telugu Movie News

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్‌ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడు.

 Raviteja To Romance Tamannaah In Next Movie

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటికే పలు వార్తలు వినిపించాయి.

అయితే పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.తొలుత ఈ కథను నేచురల్ స్టార్ నాని కోసం రాసుకున్నాడట త్రినాథరావు.

మరోసారి ఆ బ్యూటీతోనే రొమాన్స్ అంటోన్న మాస్ రాజా-Gossips-Telugu Tollywood Photo Image

కానీ తనకంటే రవితేజ అయితే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడని భావించిన నాని, ఈ సినిమాను రవితేజకు రికమెండ్ చేశాడట.దీంతో రవితేజ మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను ఓకే చేశాడట.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవడానికి చిత్ర యూనిట్ ఫిక్స్ అయినైట్లు తెలుస్తోంది.పలువురు పేర్లు వినిపించినా ఈ సినిమాలో తమన్నా అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమాలో తమన్నా ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది.

గతంలో వీరిద్దరు కలిసి బెంగాల్ టైగర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test