మళ్లీ అదే ఫార్ములాతో మాస్ రాజా..?  

Raviteja To Come Once Again With Disco Raja Backdrop - Telugu Backdrop, Disco Raja, Nakkina Trinadha Rao, Raviteja, Telugu Movie News

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ డిస్కో రాజా ఎలాంటి డిజాస్టర్‌గా మిగిలిందో అందరికీ తెలిసిందే.సినిమా కథ ప్రయోగాత్మకంగా ఉన్నా, దాన్ని మలిచిన తీరు బాగా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

 Raviteja To Come Once Again With Disco Raja Backdrop

ఇక ఈ సినిమాలో కొంత భాగం 1980కు చెందిన డాన్ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతోంది.అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా రవితేజ కోరాడట.

కానీ దర్శకుడు ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇక దీంతో రవితేజ తన నెక్ట్స్ మూవీని నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

మళ్లీ అదే ఫార్ములాతో మాస్ రాజా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా కథ కూడా ‘డిస్కోరాజా’ కథకు చాలా దగ్గరగా ఉంటుందట.దీంతో ఈ సినిమాలోనూ కొన్ని మార్పులు చేయాల్సిందిగా రవితేజ చెప్పడంతో త్రినాథరావు ఓకే అన్నాడట.

అయితే త్రినాథరావుతో పని చేసిన సక్సెస్‌ఫుల్ రైటర్ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు పనిచేయకపోవడం ఈ సినిమాపై కొంత అనుమానాలు రేకెత్తిస్తుంది.కాగా మరోసారి డిస్కోరాజా చిత్రం బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నాడంటే అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది.

మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు