మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన టువంటి చిత్రం డిస్కో రాజా.ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేస్, తాన్యా హోప్ నటించారు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత రామ్ తల్లురి నిర్మించారు.అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది.
ఎప్పుడూ సరికొత్త కథనాలను మరియు విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేటువంటి మాస్ మహారాజ రవితేజ ఈసారి డిస్కో రాజా అంటూ మన ముందుకు వచ్చేశాడు.
అయితే ఈ చిత్రం గురించి రవితేజ అభిమానులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఇప్పటికే ఈచిత్రం చూసినటువంటి అభిమానులు రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడని అంటున్నారు.
అంతేగాక ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఉందని రవిటుంతేజ తన పాత్రకి 100% న్యాయం చేశాడని రవితేజపై ప్రశంసలు కురిస్పిస్తునారు.
అంతేగాక రవితేజ గతంలో నటించినటువంటి నేల టిక్కెట్టు టచ్ చేసి చూడు వంటి చిత్రాలు దారుణంగా డిజాస్టర్లుగా మిగలడంతో రవితేజ అభిమానులు కొంతమేర నిరాశ చెందారు.కానీ ఈ చిత్రం ద్వారా రవితేజ తన అభిమానులకి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్.అయితే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
ముఖ్యంగా ఈ చిత్రంలో కొన్ని ఎలిమినేట్ అయ్యే సన్నివేశాలను దర్శకుడు చక్కగా వాడుకుంటూ కథని ఆసక్తికరంగా రక్తి కట్టించాడు.
మొత్తానికి రవితేజ ఈ సంవత్సరంలో ఓ మంచి హిట్ చిత్రంతో తన ఖాతా అని తెరిచాడని అనడంలో ఎటువంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేగాక రవితేజ తన తదుపరి చిత్రం కూడా ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది.అయితే ఈ చిత్రాన్ని వేసవిలోడుద విల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.