రామారావు ఆన్ డ్యూటీ నిర్మాత కోసం రవితేజ సంచలన నిర్ణయం.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటిగా నిలిచింది.ఈ సినిమాక్ ఫుల్ రన్ లో 7 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావడం కష్టమేనని తెలుస్తోంది.

 Raviteja Sensational Decision For Ramarao On Duty Movie Details Here Goes Viral , Raviteja, Ramarao On Duty ,rajisha Vijayan , Sudhakar, Divyansha Kaushik-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న రవితేజ సినిమా లేదనే చెప్పాలి.ఈ సినిమా వల్ల ఈ మూవీ నిర్మాత సుధాకర్ కు భారీ నష్టాలు రావడం ఖాయమని తేలిపోయింది.

అయితే ఈ సినిమా నిర్మాత తనకు మిత్రుడు కావడంతో రవితేజ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఈ నిర్మాత నిర్మాణంలో తాను మరో సినిమాలో నటిస్తానని రవితేజ హామీ ఇచ్చారని సమాచారం.

 Raviteja Sensational Decision For Ramarao On Duty Movie Details Here Goes Viral , Raviteja, Ramarao On Duty ,Rajisha Vijayan , Sudhakar, Divyansha Kaushik -రామారావు ఆన్ డ్యూటీ నిర్మాత కోసం రవితేజ సంచలన నిర్ణయం.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తక్కువ రెమ్యునరేషన్ కు ఆ సినిమాలో నటిస్తానని రవితేజ నిర్మాతకు చెప్పారని సమాచారం అందుతోంది.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటోంది.

కథల ఎంపికల లోపమో లేక దర్శకుల ఎంపికలో లోపమో తెలీదు కానీ సినిమా రంగం సుధాకర్ చెరుకూరికి కలిసిరాలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాతో నష్టపోయిన బయ్యర్లను మరో సినిమా ద్వారా ఆదుకోవాలని రవితేజ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

నిర్మాతలను ఆదుకునే విషయంలో రవితేజ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

Telugu Rajisha Vijayan, Ramarao Duty, Raviteja, Sudhakar-Movie

అన్ స్టాపబుల్ షోలో కూడా రవితేజ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ నటించిన సినిమాలలో క్రాక్ సినిమా మినహా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.రవితేజ మంచి కథలపై దృష్టి పెట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube