టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నటన, కామెడీని ఇష్టపడని అభిమానులు ఉండరు.రవితేజ సినిమా హిట్టైనా, ఫ్లాపైనా టీవీల్లో సైతం ఆయన సినిమాలకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ లు వస్తుంటాయి.
తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం రవితేజ ప్రత్యేకత.కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో రవితేజ నటించారు.
పూరీ జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు నటుడిగా మంచి పేరు తీసుకురావడంతో పాటు హీరోగా రవితేజ వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు12 కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అయితే క్రాక్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రవితేజకు తొలి పారితోషికానికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్నకు సంబంధించి రవితేజ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను తొలిసారి నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని ఆ సినిమాకు పని చేసినందుకు నాగార్జున 3,500 రూపాయల చెక్ ఇచ్చారని అదే తన తొలి పారితోషికం అని రవితేజ వెల్లడించారు.నాగార్జున తొలి పారితోషికంగా ఇచ్చిన చెక్కును తాను కొంతకాలం జాగ్రత్తగా దాచుకున్నానని అయితే ఆ తరువాత ఖర్చుల నిమిత్తం ఖర్చు చేశానని రవితేజ చెప్పుకొచ్చారు.అయితే రవితేజ తీసుకున్న తొలి పారితోషికం అంత తక్కువా అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.
1996 సంవత్సరంలో నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.మరోవైపు రవితేజ ప్రస్తుతంఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు.ఖిలాడీ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారని రాశీఖన్నా రవితేజకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.