వామ్మో రవితేజ.. అన్ని ప్లాప్ లు వచ్చిన అంత రెమ్యూనరేషనా?

మాస్ మహా రాజ్ రవి తేజ సినిమాలు ఎంత ఊపునిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మాస్ మహారాజ్ సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన సరే చూసినంత సేపు నవ్వుతూనే ఉంటాం.

 Mass Maharaj Ravi Teja Demands 15crore Remuneration, Mass Maharaj Raviteja, 15 C-TeluguStop.com

ఫైట్స్ కానీ, కామెడీ కానీ ఎక్కడ తగ్గకుండా ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తాడు రవి తేజ.

ఇక అలానే ఫుల్ జోష్ ఇచ్చినప్పటికీ సినిమాలు వరుసగా ప్లాప్ లు అయ్యాయి.ఆలా ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి.కానీ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం లేదట.ఒకో సినిమా కోసం అయిన 15 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ అడగనున్నట్టు వార్తలు వస్తున్నాయ్.

నిజానికి రాజాధి గ్రేట్ సినిమా తర్వాత ఆయనకు అనుకున్న రీతిలో ఏ సినిమా హిట్ అవ్వలేదు.

వరసగా సినిమాలు ప్లాప్ లే అవుతున్నాయ్.ఇక ఇప్పటికే క్రాక్ సినిమా తీసినప్పటికి లాక్ డౌన్ కారణంగా విడుదల అవ్వలేదు.

ఇక ఇప్పటికే మాస్ మహా రాజ్ చేతిలో మూడు సినిమాలుపైగా ఉన్నాయ్.అయితే ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో ఒక సినిమాకు రవి తేజ ఓకే చెప్పేశాడట.

ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మించనుంది.ఇక ఈ సినిమాకు రవితేజ ఏకంగా 15 కోట్ల రూపాయిలు పారితోషికం అడగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయ్.కథ మీద నమ్మకం ఉండటం వల్ల ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయించినున్నారట.ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా కాకుండా రవితేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయ్.

కానీ రవితేజ మొదట మారుతీ సినిమాలోనే నటించనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్.ఏది ఏమైనా రవి తేజకు వరుస ప్లాప్ లు వచ్చినప్పటికి అంత మొత్తంలో రెమ్యూనరేషన్ అడగడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube