జాతిరత్నాలు పాపకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మాస్ రాజా

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి వేసవి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

 Raviteja Recommends Faria Abdullah For His Next Movie-TeluguStop.com

ఇక క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఈ సినిమా వస్తుండటంతో రవితేజ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసగా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు రవితేజ.

ఈ క్రమంలోనే తన నెక్ట్స్ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాల్సిందిగా ఓ అమ్మాయిని రికమెండ్ చేశాడట రవితేజ.ఇటీవల ఫుల్టూ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో అందాల భామ ఫరియా అబ్దుల్లా అందరినీ తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది.

 Raviteja Recommends Faria Abdullah For His Next Movie-జాతిరత్నాలు పాపకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మాస్ రాజా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో అమ్మడి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమెపై ఇతర దర్శకనిర్మాతల చూపు పడింది.అయితే రవితేజ మాత్రం అమ్మడి హైట్‌కు ఫిదా అయ్యాడట.

టాలీవుడ్‌లో దాదాపు అనుష్క ఎత్తుకు సమానంగా ఉండటంతో ఈ బ్యూటీని తన సినిమాలో తీసుకోవాల్సిందిగా రవితేజ కోరాడట.

ఏదేమైనా ‘జాతిరత్నాలు’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఫరియా ఇప్పుడు వరుసగా ఆఫర్లు కూడా సాధిస్తోంది.

మరి రవితేజ సరసన నటించే ఛాన్స్ ఈ అమ్మడికి నిజంగానే దక్కుతుందా లేదా అనేది చూడాలి.ఏదేమైనా ఈ బ్యూటీ ప్రస్తుతం కుర్రకారుకి హాట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిందనే విషయం మాత్రం వాస్తవం అంటున్నారు సినీ ప్రేమికులు.

ఇక రవితేజ నటిస్తున్న ఖిలాడి చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

#Faria Abdullah #Khiladi #Jathi Ratnalu #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు