లాయర్ గా మారబోతున్న మాస్ మహారాజ్  

Raviteja Ready to Play Layer Role in Next Movie, Trinadha Rao Nakkina, Prasanna Kumar, Khiladi Movie, Krack Movie - Telugu Khiladi Movie, Krack Movie, Layer Role, Prasanna Kumar, Raviteja, Trinadha Rao Nakkina

మాస్ మహారాజ్ రవితేజ ఇప్పటి వరకు కెరియర్ లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రలలో కనిపించి సందడి చేశాడు.విక్రమార్కుడు సినిమా నుంచి అతను పోలీస్ పాత్రలకి కేరాఫ్ గా మారిపోయాడు.

TeluguStop.com - Raviteja Ready To Play Layer Role In Next Movie

రవితేజ పోలీస్ ఆఫీసర్ అంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే ఒక బ్రాండ్ పడిపోయింది.అయితే వాటిని మాత్రమే కాకుండా కెరియర్ లో భిన్నమైన పాత్రలు చాలా వరకు చేశాడు.

హీరోయిజంలో కూడా కామెడీని ప్రెజెంట్ చేయడంలో ప్రస్తుతం ఉన్న హీరోలని తీసుకుంటే రవితేజ కచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు.అతనిని స్పూర్తిగా తీసుకొనే మిగిలిన హీరోలు కూడా కామెడీ పడించడం మొదలు పెట్టారు.

TeluguStop.com - లాయర్ గా మారబోతున్న మాస్ మహారాజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

క్రాక్ సినిమాతో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా అలరించిన రవితేజ ప్రస్తుతం జరుగుతున్న ఖిలాడీ కోసం దొంగ అవతారం ఎత్తాడు.ఇందులో రాబరీ కింగ్ గా కనిపించబోతున్నాడు.

దీని తర్వాత త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధమైంది.

కామెడీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కథలు రాయడంలో మంచి ప్రావీణ్యం ఉన్న ప్రసన్నకుమార్ ఈ సినిమాకి కథ అందించాడు.ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

అలాగే రవితేజ తండ్రి పాత్రకి కూడా సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని, అతను కూడా లాయర్ పాత్రలోనే కనిపిస్తాడని తెలుస్తుంది.వీరిద్దరి మధ్య కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో హైలైట్ గా ఉంటాయని టాక్ నడుస్తుంది.

కోర్టు సన్నివేశాలు చాలా ఫన్ క్రియేట్ చేసే విధంగా ఉంటాయని బోగట్టా.ఖిలాడీ సినిమా పూర్తి కాగానే ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో రవితేజ ఉన్నట్లు తెలుస్తుంది.

#Raviteja #Layer Role #Prasanna Kumar #TrinadhaRao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు