విలన్ వేషాలు వేస్తానంటున్న మాస్ రాజా  

Raviteja Ready To Do Villain Roles-raviteja,telugu Movie News,villain Role

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా చిత్ర షూటింగ్‌ను ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాలో రవితేజ పాత్ర సినిమాకే హైలైట్ కానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Raviteja Ready To Do Villain Roles-raviteja,telugu Movie News,villain Role-Telugu Gossips Raviteja Ready To Do Villain Roles-raviteja Telugu Movie News Villain Role-Raviteja Ready To Do Villain Roles-Raviteja Telugu Movie News Role

ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే మొదలుపెట్టారు.ఈ సినిమాపై మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే ఈ సినిమా ఓ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందని చిత్ర పోస్టర్స్, టీజర్స్ చూస్తే తెలుస్తోంది.కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.

పాత్ర విభిన్నంగా ఉంటే తాను ఎలాంటి రోల్స్ చేసేందుకైనా సిద్ధమని అన్నారు.కథలో బలం ఉండి, విలన్ పాత్ర పూర్తి విభిన్నంగా ఉంటే తాను విలన్ రోల్ చేయడానికైనా సిద్ధం అంటూ రవితేజ బాంబ్ పేల్చాడు.

అసలే మాస్ జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మాస్ రాజా రవితేజ, విలన్ పాత్రలో నటిస్తే ఆ పాత్ర ఎలా ఉంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.రవితేజ విలన్ పాత్రలకు సై అనడంతో మాస్ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం రవితేజ విలన్ వేషాలు వేస్తాడా లేక సినిమా ప్రమోషన్స్‌ కోసం ‘మమ’ అన్నాడా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

తాజా వార్తలు

Raviteja Ready To Do Villain Roles-raviteja,telugu Movie News,villain Role Related....