ఖిలాడిలో లిప్ కిస్ గురించి రవితేజ ఏం అన్నాడంటే?

కొంతమంది హీరో హీరోయిన్ లకు లిప్ లాక్ సీన్లలో నటించడం కామన్.కానీ కొందరు మాత్రం అలాంటి సీన్ లలో నటించడానికి పెద్దగా ఇష్టపడరు.

 Raviteja Reaction On Lip Kiss In Khiladi, Ravi Teja, Khiladi Movie, Lip Lock, Re-TeluguStop.com

ఇంకొందరు ప్రమోషన్ లో భాగంగా సినిమాల కోసం అలాంటి సీన్ లలో నటిస్తూ ఉంటారు.అయితే ఒక హీరో మాత్రం తన సినీ కెరీర్ లో ఇంతవరకూ ఒక్క లిప్ లాక్ సీన్ లో కూడా నటించలేదు.

మరి ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ.ఇప్పటివరకు ఒక్క ముద్దు సీన్ లో కూడా నటించిన రవితేజ తాజాగా నటించిన సినిమాలో ముద్దు సీన్ లో నటించడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ లో గత మూడు రోజులుగా ఇదే విషయం గురించి వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.

రవితేజ తాజాగా నటించిన సినిమా ఖిలాడీ.ఇందులో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరీ లు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తెలుగు హిందీ భాషల్లో నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన అయ్యింది.అయితే ఇందులో లిప్ లాక్ సీన్ గురించి పెద్ద హాట్ టాపిక్ గా మారడంతో ఈ విషయంపై తాజాగా రవితేజ స్పందించాడు.

నేను ఒక ప్రొఫెషనల్ నటుడిని.నాకు సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు.

క్యారెక్టర్ ని బట్టి చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాను.అదే విధంగా ఖిలాడీ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ అనేది నా ప్రొఫెషన్ లో భాగమే.

ఇక ఆ సీన్ ఎందుకు చేశాను? ఎవరితో చేశాను? ఇలాంటి విషయాలు మాత్రం మీరు వెండితెరపైనే చూసి ఆనందించండి అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు రవితేజ.అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.తమ అభిమాన హీరో సినిమా విడుదల అవడంతో రవితేజ అభిమానులు థియేటర్ల వద్ద భారీగా క్యూలు కట్టారు.అంతేకాకుండా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.మరి క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న రవితేజ ఈ సినిమాతో ప్రేక్షకులను అనుకున్న విధంగా మెప్పిస్తాడో చూడాలి మరి.

Raviteja Reaction On Lip Kiss In Khiladi, Ravi Teja, Khiladi Movie, Lip Lock, Reaction - Telugu Khiladi, Lip Lock, Ravi Teja

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube