'రావణసుర' లో రవితేజ పాత్రపై ఇంట్రెస్టింగ్ పుకారు

మాస్ మహా రాజా రవితేజ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ల జాబిత చాలా పెద్దగా ఉంది.త్వరలో ఖిలాడి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఆ వెంటనే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది.

 Raviteja Ravanasura Movie Interesting Update , Flim News, Ravanasura , Ravi Teja-TeluguStop.com

అన్నట్లుగానే షూటింగ్‌ ను మొదలు పెట్టారు.మరో వైపు ధమాకా సినిమా ను కూడా చేస్తున్నాడు.

త్రినాధ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతున్న ధమాకా సినిమా మొదటి షెడ్యూల్‌ ను ముగించారు.ఇక టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా తో భారీ ఎత్తున రవితేజ ఒక బయోపిక్ ను చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఇన్ని సినిమా ల నడము రావణాసుర అనే సినిమాను కూడా మొదలు పెట్టడం జరిగింది.ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలు అవుతుందో కాని అన్నింటికి మించి అన్నట్లుగా ఆ సినిమా అంచనాలను కలిగి ఉంది.

Telugu Ravanasura, Ravi Teja, Tadaka, Tigernageshwara-Movie

అద్బుతమైన ఒక కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది.భారీ ఎత్తున అంచనాలున్న రావణసుర లో రవితేజ లుక్ ఏంటీ.ఎలా కనిపించబోతున్నాడు అనేది ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది.సినిమా ప్రకటించిన సమయంలోనే రవితేజ లుక్ ను రివీల్ చేశారు.చాలా పవర్‌ ఫుల్‌ గా ఒక చైర్ లో కూర్చుని ఉన్నాడు.నల్ల కోర్టు వేసుకుని ఉన్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో రవితేజ వకీల్ సాబ్‌ గా కనిపించబోతున్నాడట.అందుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రముఖ నటీ నటులు ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు టార్గెట్‌ గా ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ చేస్తున్నాడు.

నాలుగు సంవత్సరాల క్రితం ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube