వీరయ్యతో కలిసి మాస్ రాజా రచ్చ రచ్చ.. మెగా ఫ్యాన్స్ సైతం ఫిదా!

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ ఫుల్ పూనకాలతో ఊగిపోతారు అనే విషయం తెలిసిందే.ఇక ఈయన సినిమాలో మరో హీరో ఉన్నప్పటికీ ఈయన కంటే వెయిట్ ఎక్కువ ఉండదు అని భావిస్తారు.

 Raviteja Powerful Role In Chiranjeevi Waltair Veerayya Details, Director Bobby,-TeluguStop.com

అయితే తాజాగా నటించిన మెగాస్టార్ ”వాల్తేరు వీరయ్య”లో మాత్రం చిరు పాత్రకు ఎంత వెయిట్ ఉందో అలాగే రవితేజ పాత్రకు కూడా అంతే వెయిట్ అనేది ఉంటుంది.

ఇటీవలే ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ రాజా రవితేజ ఇక ఇప్పుడు మెగాస్టార్ తో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో మాస్ రాజా సందడి చేసారు.ఇక ఈ సినిమాలో కూడా అదే ఎనర్జీతో అదరగొట్టాడు.తన పవర్ ఫుల్ రోల్ లో రవితేజ మరింత పవర్ ఫుల్ గా కనిపించి అదరగొట్టాడు.

Telugu Bobby, Fans, Chiranjeevi, Ravi Teja, Raviteja, Raviteja Role, Ravitejawal

చిరు, రవితేజ బ్రదర్స్ గా నటించారు.ఈ సినిమాలో రవితేజ సూపర్ ఫైట్ తో ఎంట్రీ ఇచ్చి ఈయన పాత్ర ముగిసే వరకు అదే ఎనర్జీ ఉండేలా చూసుకున్నాడు.ఇక ఈ సినిమాలో ఈయన పాత్ర ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది.

రవితేజ వీరయ్య సినిమాకు మంచి ప్లస్ అయ్యి మెగా ఫ్యాన్స్ ను సైతం మెప్పించాడు.బాబీ ఒకానొక సమయంలో చిరు పాత్రను కూడా డామినేట్ చూసే విధంగా చూపించాడు అంటేనే అర్ధం చేసుకోండి రవితేజ ఎంత కుమ్మేసాడో.

Telugu Bobby, Fans, Chiranjeevi, Ravi Teja, Raviteja, Raviteja Role, Ravitejawal

ఇక సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఫారిన్ లో కూడా వాల్తేరు వీరయ్య సందడి కనిపిస్తుంది.ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తెల్లవారు జాము నుండే మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది.రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా మెగా ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు.

Telugu Bobby, Fans, Chiranjeevi, Ravi Teja, Raviteja, Raviteja Role, Ravitejawal

అసలైన సంక్రాంతి పండుగ అంటే ఇదే అంటూ మాస్ జాతర అందించాడు.ఇక చిరు, రవితేజతో పాటు శృతి హాసన్ కూడా మెప్పించింది.దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాడు.

మొత్తానికి లేటుగా ఎంట్రీ ఇచ్చినా చిరు సినిమాతో సంక్రాంతి రచ్చ షురూ అయ్యింది.చూడాలి మెగా ఫ్యాన్స్ వీరయ్యను ఏ రేంజ్ లో హిట్ చేస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube