క్రాక్‌లో పాయల్ పాప ఏం చేస్తుందో తెలుసా?

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘క్రాక్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

 Payal Rajput Item Song In Krack Movie, Raviteja, Krack, Payal Rajput, Item Song,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

కాగా ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.అయితే ఈ సినిమాలో మరో బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా కనిపిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఆమె ఈ సినిమాలో కేమియో రోల్ ఏమైనా చేస్తుందా అనే సందేహం ఆమె ఫ్యాన్స్‌లో నెలకొంది.గతంలో రవితేజ సరసన ‘డిస్కో రాజా’ చిత్రంలో నటించిన పాయల్, ఇప్పుడు మరోసారి రవితేజ సినిమాలో కనిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆమె ఈ సినిమాలో చేసేది కేవలం ఓ ఐటెం సాంగ్ అని తెలుస్తోంది.

గతంలోనూ ఒకట్రెండు ఐటెం సాంగ్స్ చేసిన పాయల్, మరోసారి అదే కోవలో కనిపించేందుకు రెడీ అవుతోంది.

మాస్ రాజా సినిమాలో మాస్ మసాలా సాంగ్స్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి.ఇక రవితేజ లాంటి ఎనర్జిటిక్ స్టార్ చిందులు, పాయల్ పాప అందాలు కలగలిసి ఈ పాటను నిజంగానే స్పెషల్ చేయడం ఖాయమని రవితేజ ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా లాక్‌డౌన్ ముగియగానే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube