ఆ హిట్ జోడీతో రవితేజ నెక్స్ట్ సినిమా

సినిమా చూపిస్తా మామా సినిమాతో టాలీవుడ్ లో హిట్ జోడీగా త్రినాధరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.కమర్షియల్ కథలకి కాస్తా కామెడీ టచ్ ఇచ్చి వీరు చేసిన మొదటి సినిమా తర్వాత నానితో నేను లోకల్ సూపర్ హిట్ అయ్యాయి.

 Raviteja Next Movie With Trinadh Rao Nakkina-TeluguStop.com

దీంతో టాలీవుడ్ లో వీరు పేర్లు మారుమోగిపోయాయి.ఇక దర్శకుడు త్రినాద్ రావు నక్కిన నక్క తోక తోక్కినట్లే అని అందరూ భావించారు.

అయితే ఊహించని విధంగా మూడో సినిమా హలో గురు ప్రేమ కోసమే అంటూ రామ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఇది రొటీన్ ఫార్ములా స్టొరీగా మిగిలిపోయింది.

అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.దీంతో వీళ్ళకి మళ్ళీ బ్రేక్ ఏర్పడింది.

ఆ మధ్య సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ తో సినిమా ఉంటుందని బయటకి వినిపించింది.దీని గురించి అఫీషియల్ గా రాకున్న చాలా వరకు వాస్తవం అని తెలిసింది.

అయితే ఏ కారణంగానో వీరు వెంకటేష్ తో మూవీ చేయలేదు.అయితే ఇప్పుడు ఊహించని విధంగా మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు.దీని తర్వాత త్రినాద్ రావు నక్కిన సినిమా సెట్స్ పైకి వెళ్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో దర్శక, రచయిత జోడీ ఎంత వరకు హిట్ కొడతారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube