మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా రామారావు అని ఫిక్స్ చేశారు.రామారావు ఆన్ డ్యూటీ అని రవితేజ మాస్ అప్పీల్ తో వస్తున్నారు.
అయితే రామారావు టైటిల్ ను రవితేజ పెట్టడంపై చర్చాంశనీయంగా మారింది ఎందుకంటే కొన్నాళ్లుగా ఆ టైటిల్ ను బాలకృష్ణ తన సినిమాకు పెట్టాలని అనుకుంటున్నారు.అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలకృష్ణ హీరోగా చేయాల్సిన సినిమాకు రామారావు టైటిల్ నే అనుకున్నారు.
కాని ఈలోగా రవితేజ సినిమాకు ఆ టైటిల్ పెట్టేశారు.ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో గా నటిస్తున్నాడని తెలుస్తుంది.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ విన్న వెంటనే ఓకే చేశారట రవితేజ.క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ రాజా ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నారు.
రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నారు.ఖిలాడి షూటింగ్ పూర్తి కాగా రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు.
ఇక శరత్ మండవ డైరక్షన్ లో రామారావుగా అదరగొట్టేందుకు వస్తున్నారు రవితేజ.ఈ సినిమాకు టైటిలే పెద్ద అసెట్ అయ్యేలా ఉంది.పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూడాలి.