కొత్త చిత్రానికి ముహూర్తం పెట్టేసిన మాస్ రాజా  

Raviteja New Movie Launch On October 18, Raviteja, Krack, Ramesh Varma, Tollywood News - Telugu Krack, Ramesh Varma, Raviteja, Tollywood News

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - Raviteja New Movie Launch On October 18

కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.గతంలో రవితేజతో ‘వీర’ అనే సినిమాను తెరకెక్కించిన రమేష్ వర్మ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించేందుకు రవితేజ సిద్ధమయ్యాడు.

కాగా ఈ సినిమా గురించి గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నా, ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ, ఈ సినిమా ముహూర్తం సమయం మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.ఈ సినిమా ముహూర్తం, ఫస్ట్ లుక్ రిలీజ్‌ను అక్టోబర్ 18న ఉదయం 11.55 గంటలకు నిర్ణయించారు.కాగా ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ 2 నుండి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను మాస్ రాజా ప్రేక్షకులకు అన్ని విధాలా నచ్చేలా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

TeluguStop.com - కొత్త చిత్రానికి ముహూర్తం పెట్టేసిన మాస్ రాజా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక రవితేజ కెరీర్‌లో 67వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో ‘పెళ్లిచూపులు’ బ్యూటీ రీతూ వర్మను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా రవితేజ నటిస్తున్న క్రాక్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరకని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ముగించుకుని రమేష్ వర్మ చిత్రంలో పాల్గొనేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.

మరి రవితేజ కొత్త చిత్రం ఏ సబ్జెక్టుతో వస్తుందో చూడాలి అంటున్నారు అభిమానులు.

#Krack #Ramesh Varma #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raviteja New Movie Launch On October 18 Related Telugu News,Photos/Pics,Images..