ఆ రీమేక్ కోసం వెంకటేష్ తో కలుస్తున్న మాస్ మహారాజ్  

Raviteja Multi Starer With Venkatesh For Malayalam Remake - Telugu Malayalam Remake, Raviteja Multi Starer With Venkatesh, South Cinema, Telugu Cinema, Tollywood

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

 Raviteja Multi Starer With Venkatesh For Malayalam Remake

అసిస్టెంట్ దర్శకుడు స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు.కమర్షియల్ హీరోగా సక్సెస్ అయిన తర్వాత రవితేజ ఇప్పటి వరకు మల్టీ స్టారర్ చిత్రాలలో నటించలేదు.

కెరియర్ ఆరంభంలో చాలా సినిమాలలో ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.అయితే చాలా కాలం తర్వాత మరల ఇప్పుడు మల్టీ స్టారర్ లో నటించడానికి ఒకే చెప్పాడని తెలుస్తుంది.

ఆ రీమేక్ కోసం వెంకటేష్ తో కలుస్తున్న మాస్ మహారాజ్-Movie-Telugu Tollywood Photo Image

సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోశియమ్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయడం కోసం రైట్స్ సొంతం చేసుకున్నారు.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలలో ఒకరిని బాలకృష్ణ లేదంటే వెంకటేష్ అని అనుకుంటున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉండటంతో వెంకటేష్ నారప్ప షూటింగ్ చివరి దశకి వచ్చేయడంతో అతనితో వెళ్లాలని భావించినట్లు తెలుస్తుంది.ఇక రెండో హీరో కోసం చాలా మందిని ప్రయత్నం చేశారు.

రానా పేరు ఎక్కువగా వినిపించింది.అయితే ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ రవితేజ దగ్గరకి వచ్చి ఆగిందని తెలుస్తుంది.

కంటెంట్ బాగుండటంతో పాటు పాత్ర ప్రాధాన్యత ఉండటంతో రవితేజ ఈ సినిమాలో ఒరిజినల్ లో పృధ్వీ రాజ్ చేసిన పాత్ర చేయడానికి ఆసక్తి చూపించినట్లు సమాచారం.ఇక త్వరలో అధికారికంగా ఈ సినిమాని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raviteja Multi Starer With Venkatesh For Malayalam Remake Related Telugu News,Photos/Pics,Images..

footer-test