దర్శకుడికి కరోనా పాజిటివ్‌.. మరి రవితేజ?

కరోనా టాలీవుడ్ వర్గాల వారిని తీవ్రంగా భయపెడుతోంది.ప్రతి భాష సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా కరోనా బారిన పడ్డారు.

 Raviteja Movie Khiladi Director Ramesh Varma Tested Covid Positive-TeluguStop.com

ఇంకా కరోనా బారిన పడుతూనే ఉన్నారు.కరోనా ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఎంతో మంది సినీ ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ బండ్ల గణేష్‌ తో పాటు ప్రముఖులకు కరోనా వచ్చింది.ఇప్పుడు టాలీవుడ్‌ దర్శకుడు రమేష్‌ వర్మకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

 Raviteja Movie Khiladi Director Ramesh Varma Tested Covid Positive-దర్శకుడికి కరోనా పాజిటివ్‌.. మరి రవితేజ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా వల్ల ఆయన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు.గత రెండు మూడు రోజులుగా ఆయనకు లక్షణాలు ఉండటంతో అనుమానంతో పరీక్ష చేయించుకున్నాడు.

దాంతో కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.దాంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయాడని అంటున్నారు.

ఈయన ప్రస్తుతం రవితేజ తో ఖిలాడీ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొన్నటి వరకు చేశారు.

ఇటీవలే ఆ సినిమా షెడ్యూల్‌ ను పూర్తి చేశారు.రవితేజ తో ఈయన చాలా క్లోజ్ గా మెలిగాడు.

కనుక ఖచ్చితంగా రవితేజ కు కూడా కరోనా అంటి ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం.ఇప్పటి వరకు రవితేజ నుండి ఎలాంటి అప్‌ డేట్ అయితే లేదు.

ఆయన కు కరోనా రావద్దని అభిమానులు కోరుకుంటున్నారు.రమేష్‌ వర్మ ప్రస్తుతం చేస్తున్న ఖిలాడీ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది.

షూటింగ్ చివరి దశలో ఉండగా ఈయనకు కరోనా పాజిటివ్‌ రావడం అభిమానులకు మరియు చిత్ర యూనిట్ సభ్యులకు ఆందోళన కలిగిస్తోంది.ఈ దర్శకుడు ప్రస్తుతం తెలుగులో ఈ సినిమా తో పాటు మరో రెండు సినిమా లు కూడా కమిట్‌ అయ్యాడని తెలుస్తోంది.

ఖిలాడీ సక్సెస్ అయితే పెద్ద హీరో నుండి పిలుపు వస్తుందని అంటున్నారు.

#Ramesh Varma #Khiladi #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు