క్రాక్ మూవీకి పని చేసిన ఐదుగురు దర్శకులు.. ఎవరెవరంటే..?  

రవితేజ శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు దర్శకుడు గోపీచంద్ మలినేని అయినప్పటికీ ఈ సినిమా కోసం ఐదుగురు దర్శకులు పని చేయడం గమనార్హం.

TeluguStop.com - Raviteja Movie Crack Had Five Directors

టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ఐదుగురు దర్శకులు క్రాక్ సినిమాలోని కీలక పాత్రల్లో నటించారు.

ప్రముఖ దర్శకులు సముద్రఖని, బీవీఎస్ రవి, వివేక్ కృష్ణ, మహేష్ కత్తి, దేవీ ప్రసాద్ ఈ సినిమాల్లో నటించారు.

TeluguStop.com - క్రాక్ మూవీకి పని చేసిన ఐదుగురు దర్శకులు.. ఎవరెవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినీ క్రిటిక్, దర్శకుడు మహేష్ కత్తి ఈ సినిమాలో కుల సంఘం అధ్యక్షుడిగా నటించి మెప్పించారు.ఈ సినిమాలో విలన్ కటారీ కృష్ణ పాత్రలో సముద్రఖని నటించారు.

కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు సముద్రఖని దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.నాగ చైతన్య హీరోగా నటించిన బెజవాడ మూవీ డైరెక్టర్ వివేక్ కృష్ణ కూడా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించారు.

Telugu Crack Movie, Five Directors, Gopichand Malineni, Raviteja-Movie

చాలా సినిమాలకు రచయితగా పని చేసి దర్శకునిగా మారిన బీవీఎస్ రవి సైతం ఈ సినిమాలోని ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం.శ్రీవిష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాకు డైరెక్టర్ గా పని చేసిన దేవీ ప్రసాద్ సైతం ఈ సినిమాలో ఎస్సై తిలక్ పాత్రలో నటించి మెప్పించారు.ఇలా గోపీచంద్ మలినేని కాకుండా ఐదుగురు దర్శకులు ఒకే సినిమాలో నటించడం గమనార్హం.

2021 సంవత్సరంలో విడుదలైన తొలి పెద్ద సినిమా క్రాక్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది విడుదల కాబోయే కొత్త సినిమాలు కూడా సక్సెస్ కావచ్చని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

పండుగ సందర్భంగా విడుదలైన మాస్టర్ అంచనాలను అందుకోకపోయినా రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాల ఫలితాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#Five Directors #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు