నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్బంగా విడుదల చేసిన బింబిసర సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.కొందరు విమర్శిస్తూ ఉన్నా మరి కొందరు మాత్రం నందమూరి కళ్యాణ్ ను ఇంతటి సాహసం చేసేందుకు అభినందిస్తున్నారు.
ఈ సమయంలో ఇలాంటి పౌరాణిక సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న బింబిసర సినిమా కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటి అంటే బింబిసర సినిమా లో కీలక పాత్రకు గాను మొదట రవితేజను సంప్రదించారట.ఆయన మొదట ఓకే చెప్పాడు.ఆ తర్వాత ఆయన నో చెప్పాడని చెబుతున్నారు.విలన్ గా నటించేందుకు రవితేజ ఓకే చెప్పి క్రాక్ సినిమా సక్సెస్ అయిన కారణంగా హీరోగానే ఇంకా కొంత కాలం నటించాలని భావిస్తున్నాను అంటూ సున్నితంగా నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఆఫర్ ను రవితేజ తిరష్కరించాడట.
మొత్తానికి రవితేజ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ ల కలకయిలో సినిమా మిస్ అయ్యింది.రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో పాటు కొత్త దర్శకుడితో సినిమాలు చేస్తున్నాడు.
ఇదే సమయంలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయాల్సి ఉంది.విలన్ రవితేజ నటించేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఇక బింబిసర సినిమా విషయానికి వస్తే నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.సొంతంగా నిర్మించడంతో పాటు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తీస్తున్నాడు.
ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ కెరీర్ లో రెండు సక్సెస్ లు మాత్రమే ఉన్నాయి.మరి ఈ సినిమా తో అయినా ఆయన కెరీర్ ఒక గాడిలో పడుతుందేమో చూడాలి.