మహా సముద్రంలోకి దూకేసిన రవితేజ!  

మహాసముద్రం సినిమా స్టార్ట్ చేసిన రవితేజ. .

Raviteja Mahasamudram Movie Shooting Started-

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక ఇందులో రవితేజకి జోడీగా పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే..

మహా సముద్రంలోకి దూకేసిన రవితేజ!-Raviteja Mahasamudram Movie Shooting Started

ఇద్ది పీరియాడికల్ డ్రామాతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హ్యాట్రిక్ లతో ఉన్న రవితేజకి కచ్చితంగా ఈసినిమాతో హిట్ కావాలి. ఈ సినిమా తర్వాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేస్తాడని టాక్ ఉంది.

అయితే ఊహించని విధంగా రవితేజ ఇప్పుడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. మహా సముద్రం టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని సమాచారం.

ఈ సినిమాలో రవితేజ మరో సారి స్టార్ హీరోయిన్ కాజల్ తో రొమాన్స్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఎలాంటి ఆర్బాటం లేకుండా ఈ సినిమాని దర్శకుడు మొదలెట్టినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.