మెగాస్టార్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్న హీరో రవితేజ?

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఘన విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు ఇండస్ట్రీకి దూరమైనా మెగాస్టార్ క్రేజ్ అణువంతైనా తగ్గలేదు.

 Raviteja Looking Forward On Megastar Chiranjeevi Old Classic Title  Ravi Teja, K-TeluguStop.com

రీఎంట్రీలో ఖైదీ నంబర్ 150, సైరా విజయాలతో సీనియర్ స్టార్ హీరోలలో ఇప్పటికే నంబర్ అని చిరంజీవి ప్రూవ్ చేసుకున్నారు.ప్రస్తుతం చాలామంది యువహీరోలు ప్రస్తుతం చిరంజీవి హిట్టు సినిమా టైటిల్స్ ను వాళ్ల సినిమాలకు ఉపయోగించుకున్నారు.

సాధారణంగా ఇండస్ట్రీలో టైటిల్ రిజిష్టర్ చేసుకున్న తరువాత పది సంవత్సరాల పాటు ఆ టైటిల్ ను మరో సినిమాకు ఉపయోగించుకోకూడదని నియమనిబంధనలు ఉన్నాయి.పది సంవత్సరాల తరువాత సినిమాకు పాత సినిమా టైటిల్ సూట్ అవుతుందని భావిస్తే టైటిల్ ను రిజిష్టర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

అలా చిరంజీవి సినిమాలైన ఖైదీ, దొంగ, గ్యాంగ్ లీడర్, రాక్షసుడు, యముడికి మొగుడు, విజేత మరికొన్ని సినిమాల టైటిళ్లతో మళ్లీ సినిమాలు తెరకెక్కాయి.

అయితే చిరంజీవి హిట్ సినిమా టైటిళ్లను ఇతర హీరోలు వాడుకోవడంపై గతంలో మెగా ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్టార్ హీరో రవితేజ క్రాక్ సినిమా తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాలోని హీరో పాత్ర ప్రకారం సినిమాకు చంటబ్బాయ్ అనే టైటిల్ సూట్ అవుతుందని సమాచారం.

సినిమాకు ఈ టైటిల్ నే ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

రవితేజ చిరంజీవి సినిమా టైటిల్ తో నటించబోతున్నాడని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని సమాచారం.

చంటబ్బాయ్ హిట్ సినిమా కాకపోయినా చిరంజీవికి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సినిమాలలో చంటబ్బాయ్ కూడా ఒకటి.అందువల్ల మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సినిమాకు మరో టైటిల్ పెట్టుకోవాలని రవితేజకు సూచిస్తున్నారు.

మరి రవితేజ త్రినాథరావు కాంబోలో తెరకెక్కే సినిమాకు చంటబ్బాయ్ టైటిల్ నే ఫైనల్ చేస్తారో లేక మరో టైటిల్ పెడతారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube