పండగపూట క్రాక్ చూపిస్తానంటున్న మాస్ రాజా!  

Raviteja Krack Teaser To Release On Eve Of Shivaratri - Telugu Gopichand Malineni, Krack, Raviteja, Shruti Hassan, Teaser

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ డిస్కో రాజా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మిగిలింది.ఈ సినిమాతో హిట్ కొట్టాలని ప్రయత్నించిన రవితేజ ఇప్పుడు తన ఫోకస్‌ను పూర్తిగా తన తాజా చిత్రం ‘క్రాక్’పై పెట్టాడు.

Raviteja Krack Teaser To Release On Eve Of Shivaratri - Telugu Gopichand Malineni Shruti Hassan

ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా చిత్రంపై అంచనాలను రెట్టింపు చేశాయి.

కాగా ఈ సినిమా టీజర్‌ను శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఓపవర్‌ఫుల్ కాప్‌గా రవితేజ ఈ సినిమాలో నటిస్తు్న్నాడు.ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ టీజర్ ఎలా ఉంటుందా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇక శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా అందాల భామ శృతిహాసన్ నటిస్తోంది.

కాగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముథిరఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవితేజ గతంలో బలుపు, డాన్ శీను చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర టీజర్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

తాజా వార్తలు

Raviteja Krack Teaser To Release On Eve Of Shivaratri-krack,raviteja,shruti Hassan,teaser Related....