టీజర్‌ను పట్టుకొస్తున్న క్రాక్ రాజా  

Raviteja Krack Movie Teaser Coming Soon-krack Movie,raviteja,shruti Hassan,telugu Movie News,thaman

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్ ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది.మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా ద్వారా రవితేజతో హ్యా్ట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Raviteja Krack Movie Teaser Coming Soon-Krack Raviteja Shruti Hassan Telugu News Thaman

గతంలో డాన్ శీను, బలుపు చిత్రాలతో ఈ కాంబో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.ఇప్పుడు మూడోసారి ఈ కాంబో ప్రేక్షకులముందుకు రానుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ చూస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన కొత్త పోస్టర్ కూడా సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాలో రవితేజ మరసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా టీజర్‌ను అతి త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ఠాగూర్ మధు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాను మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమా టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి అప్పుడే మాస్ రాజా ఫ్యా్న్స్‌తో పాటు ప్రేక్షకుల్లో మొదలైంది.

తాజా వార్తలు

Raviteja Krack Movie Teaser Coming Soon-krack Movie,raviteja,shruti Hassan,telugu Movie News,thaman Related....