క్రాక్ టీజర్ టాక్: ఎవరైతే నాకేంటీ అంటోన్న రవితేజ  

Raviteja Krack Movie Teaser - Telugu Gopichand Malineni, Krack, Krack Movie, Raviteja, Shruti Hassan, Teaser

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘క్రాక్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Raviteja Krack Movie Teaser - Telugu Gopichand Malineni Shruti Hassan

ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ఆ అంచనాలను పెంచాయి.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు అర్ధమవుతోంది.

ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.కాగా ఓంగోల్‌లో జరిగే హత్యలు, మైనింగ్ మాఫియాకు సంబంధించిన కథను దర్శకుడు ఎంచుకున్నట్లు టీజర్ చూస్తే స్పష్టం అవుతోంది.

ఇక ఈ సినిమాలో మరోసారి రవితేజ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో మనముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరకరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మే 8న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తాజా వార్తలు

Raviteja Krack Movie Teaser-krack,krack Movie,raviteja,shruti Hassan,teaser Related....