రవితేజ సినిమా ఓటీటీ విడుదల అవ్వనుందా?  

Raviteja, Krack Movie, Krack Movie to Release in OTT, OTT Release, Lock down Effect,Digital - Telugu Digital, Krack Movie, Krack Movie To Release In Ott, Lock Down Effect, Ott Release, Raviteja

టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీ డైరెక్ట్‌ రిలీజ్‌ అయ్యాయి.ఒక మోస్తరు స్టార్‌డం ఉన్న వారు, ఆర్థికంగా ఇబ్బంది లేని చిన్న నిర్మాతలు కూడా ఓటీటీ విడుదలకు సిద్దం కావడం లేదు.

 Raviteja Krack Movie Ott Release

రెడీగా ఉన్న సినిమాలను కూడా వెయిట్‌ అండ్‌ సీ పాలసీతో వాయిదా వేస్తూ వస్తున్నాయి.పదుల సంఖ్యలో సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా ఏ ఒక్క స్టార్‌ హీరో సినిమా కూడా ఓటీటీ విడుదలకు రెడీ అవ్వడం లేదు.

తమిళం, హిందీ భాషల్లో ఓటీటీ జోరు పెరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో కూడా మెల్ల మెల్లగా ఓటీటీ జోరు పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది.ఇప్పటికే ఓటీటీలో రవితేజ చిత్రం క్రాక్‌ను విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట.

రవితేజ సినిమా ఓటీటీ విడుదల అవ్వనుందా-Movie-Telugu Tollywood Photo Image

క్రాక్‌ను ఓటీటీలో విడుదల చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, విడుదల విషయంలో తాను జోక్యం చేసుకోబోను అంటూ నిర్మాతలకు రవితేజ క్లారిటీ ఇవ్వడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యారట.

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌తో చర్చలు జరుపుతున్నారనే టాక్‌ వినిపిస్తుంది.రవితేజకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో భారీగానే పెట్టేందుకు ఓటీటీలు సిద్దంగా ఉన్నాయి.నిర్మాతకు రూపాయి నష్టం లేకుండానే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

సినిమా విడుదల విషయంలో ఏ ప్రాతిపధికన ఒప్పందం కుదుర్చుకోవాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయట.త్వరలోనే క్రాక్‌ నిర్మాతలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

అంతా సవ్యంగా సాగితే వచ్చే నెల ఆరంభంలో లేదంటే ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

#OTT Release #Digital #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raviteja Krack Movie Ott Release Related Telugu News,Photos/Pics,Images..