ఆహా రూ.10 కోట్లు పెట్టాం 50 రోజులు ఆగేది లేదు, 4వ వారమే దించేస్తున్నాం  

raviteja krack movie going to stream very soon in aha ott, aha ott, allu aravind ott aha, krack movie in aha, krack movie in ott, ravi teja, telugu flim news, telugu ott aha - Telugu Aha Ott, Allu Aravind Ott Aha, Krack Movie In Aha, Krack Movie In Ott, Ravi Teja, Telugu Film News, Telugu Ott Aha

మాస్‌ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్‌‘ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అనుకున్నట్లుగానే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

TeluguStop.com - Raviteja Krack Movie Going To Stream Very Soon In Aha Ott

సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు అందరి మన్ననలు దక్కించుకుంది.సినిమాకు సంబంధించిన వసూళ్లు నిర్మాతను మరియు బయ్యర్లను పూర్తిగా సంతృప్తి పర్చింది.

ఈ సినిమా 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.కేవలం అయిదు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించి మంచి బిగినింగ్ ను ఈ ఏడాది టాలీవుడ్‌ కు ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

TeluguStop.com - ఆహా రూ.10 కోట్లు పెట్టాం 50 రోజులు ఆగేది లేదు, 4వ వారమే దించేస్తున్నాం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మాస్ మసాలా మూవీగా రూపొందిన ఈ సినిమాను ఆహా వారు ఓటీటీ రైట్స్ దక్కించుకున్నారు.దాదాపుగా పది కోట్ల రూపాయలను పెట్టి ఆహా వారు ఈ సినిమాను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

థియేటర్‌ లలో విడుదల అయిన సినిమాలు 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద స్ట్రీమింగ్‌ చేయాల్సి ఉంటుంది.గతంలో నిర్మాతలకు మరియు బయ్యర్లకు అదే ఒప్పందం జరిగింది.

క్రాక్‌ విషయంలో అది జరగలేదు.కనుక నాలుగు వారాలు పూర్తి అవ్వడమే ఆలస్యం క్రాక్‌ ను ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు.

ఆహా వారు పది కోట్లు పెట్టి కొనుగోలు చేశారు కనుక మరీ 50 రోజులు వెయిట్ చేసేది లేదు అంటున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రెండు మూడు వారాల కంటే ఎక్కువగా ఆడే అవకాశం లేదు.

నాలుగు వారాల తర్వాత సినిమా అసలు థియేటర్లలో ఉండే అవకాశం లేదు.కనుక ఆహా లో విడుదల చేయడం వల్ల రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయి.ఇటీవలే క్రాక్‌ కు మళ్లీ థియేటర్లను పెంచినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలో ఆహాలో స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు.10 కోట్ల పెట్టిన అల్లు వారు అంత సులభంగా క్రాక్‌ ను వదిలేస్తారా చెప్పండి.

#AlluAravind #Aha OTT #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు