మాస్ లుక్‌తో రవితేజ క్రాక్ మసాలా!  

Raviteja Krack First Look Impressive-gopichand Malineni,impressive,krack,raviteja,telugu Movie News

మాస్ రాజా రవితేజ 2019లో ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు.దీంతో ఆయన ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనయ్యారు.కాగా 2020లో రవితేజ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే డిస్కో రాజా చిత్రాన్ని పూర్తి చేసిన రవితేజ, క్రాక్ అనే సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

Raviteja Krack First Look Impressive-Gopichand Malineni Impressive Krack Raviteja Telugu Movie News

క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కో రాజా విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతోంది.కాగా పోలీస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా క్రాక్ చిత్రాన్ని గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నాడు.

గతంలో డాన్ శీను, బలుపు చిత్రాలను రవితేజతో తీసిన ఈ డైరెక్టర్ ముచ్చటగా మూడోసారి క్రాక్ అనే సినిమాతో రాబోతున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ మాస్ లుక్‌తో మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.క్రాక్ పోలీస్‌గా సినిమాలో రవితేజ యాక్షన్ హైలైట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

శృతి హాసన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు ప్రొడ్యూస్ చేస్తు్ండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు

Raviteja Krack First Look Impressive-gopichand Malineni,impressive,krack,raviteja,telugu Movie News Related....