రవితేజ ఖిలాడీ రిలీజ్ వాయిదా

కరోనా సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఇండియాలో ఎంత కాలం ఉంటుందో కాని చిత్ర పరిశ్రమకి మాత్రమ కోలుకొని విధంగా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.ఓ వైపు ఇండస్ట్రీలో కరోనాతో సెలబ్రిటీ మరణాలు విషాదాన్ని నింపుతూ ఉంటే కోట్ల రూపాయిల పెట్టుబడులు పెట్టి తీసిన సినిమాలని థియేటర్ లో రిలీజ్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా వందల కోట్ల రూపాయిల నష్టాన్ని కలిగిస్తుంది.

 Raviteja Khiladi Movie Postponed-TeluguStop.com

గత ఏడాది కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకి ఏకంగా వెయ్యి కోట్లకి పైగానే నష్టం వచ్చింది.అలాగే వేలాది మంది సినిమాల మీద ఆధారపడి బ్రతికేవారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే స్థితికి కరోనా మహమ్మారి తీసుకొచ్చింది.

కొంత రిలీఫ్ ఇచ్చింది అనుకుంటే ఏప్రిల్ నుంచి మళ్ళీ మొదటికి వచ్చి గతసారి కంటే మరింత ఎక్కువగా కేసులు పెరుగుతూ ఉన్నాయి.ఈ సారి డెత్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది.

 Raviteja Khiladi Movie Postponed-రవితేజ ఖిలాడీ రిలీజ్ వాయిదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లాక్ డౌన్ విధించాకపోయిన కొత్తరకం కరోనాకి భయపడి ఎవరికి వారు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుంటున్నారు.

ఇక సెలబ్రిటీలు కూడా ఇప్పటికే జరుగుతున్న షూటింగ్ లని ఆపేసి ఇంటికే పరిమితం అయిపోయారు.

తప్పనిసరి పరిస్థితిలో కట్టుదిట్టమైన కరోనా వలయంలో కొంత మంది తక్కువ మంది క్రూతో షూటింగ్ చేసుకుంటున్నారు.అలాగే రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి.

గత నెలలో రిలీజ్ కావాల్సిన నాని టక్ జగదీష్ ఇప్పటికే వాయిదా పడింది.అలాగే మరికొన్ని సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.

ఇప్పుడు ఈ దారిలోకి మాస్ మహారాజ్ రవితేజ సినిమా కూడా వచ్చి చేరింది.రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన ఖిలాడీ సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే కరోనా సిచువేషన్ కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఆచార్య సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది.

మిగిలిన వారు కూడా ఒకరి తర్వాత ఒకరుగా వెనక్కి పోతున్నారు.మరి చిత్ర పరిశ్రమకి కరోనా ఎప్పుడు సంపూర్ణ విముక్తి కల్పిస్తుంది అనేది వేచి చూడాలి.

#DirectorRamesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు