ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన మాస్ రాజా!

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.కాగా ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అప్పుడే లైన్‌లో పెడుతున్నాడు.

 Raviteja Khiladi First Glimpse Released, Raviteja, Khiladi, Krack, Tollywood New-TeluguStop.com

దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఖిలాడి’ చిత్రంలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సె్స్ అయ్యాయి.

కాగా జనవరి 26న పుట్టినరోజు జరుపుకుంటున్న మాస్ రాజా, తన అభిమానులు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.ఖిలాడి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో అల్ట్రా స్టైలిష్‌గా ఉండటంతో రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.క్రాక్ చిత్రం సక్సెస్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తున్న రవితేజ ఫ్యాన్స్‌కు ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో మాస్ రాజా లుక్ బాగా నచ్చింది.

స్టైలిష్‌గా చేతిలో రాడ్ పట్టుకుని రవితేజ ఎంట్రీ ఇచ్చిన విధానం, దానికి తగ్గట్టుగా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సూపర్‌గా మార్చాయి.

ఇక పూర్తి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఖిలాడి చిత్రంతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube