రవితేజని లైన్ లో పెట్టిన భీష్మ డైరక్టర్..!

మాస్ మహరాజ్ రవితేజ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫాం లో ఉన్నాడు.క్రాక్ హిట్ తో మళ్లీ కెరియర్ ఊపందుకోగా ఖిలాడితో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Raviteja Green Signal For Bheeshma Director Venky Kudumula-TeluguStop.com

ఖిలాడి రిలీజ్ కు రెడీ అవగా శరత్ మండవ డైరక్షన్ లో రామారావు సినిమా చేస్తున్నాడు రవితేజ.ఈ మూవీలో రవితేజ సబ్ కలెక్టర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇక దీనితో పాటుగా మరో మూవీ కూడా లైన్ లో పెట్టాడట మాస్ రాజా.ఛలో, భీష్మ చేసిన రెండు సినిమాలతో హిట్ అందుకున్న సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుముల తన థర్డ్ ప్రాజెక్ట్ షురూ చేస్తున్నారు.

 Raviteja Green Signal For Bheeshma Director Venky Kudumula-రవితేజని లైన్ లో పెట్టిన భీష్మ డైరక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలైతే చరణ్, వరుణ్ తేజ్ లతో సినిమా ప్లాన్ చేసిన వెంకీ కుడుముల మెగా హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో మాస్ మహరాజ్ దగ్గరకు వచ్చాడు.

వెంకీ కుడుముల స్టోరీ చెప్పగా రవితేజ ఓకే అన్నట్టు టాక్.

త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు వెంకీ కుడుముల.

రవితేజ మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటు తన మార్క్ కామెడీ కూడా ఉంటుందని తెలుస్తుంది.మరి వెంకీ, రవితేజ ఈ కాంబో ఆడియెన్స్ ను ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

#Venky Kudumula #Bheeshma #Raviteja #Raviteja Venky #Chalo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు