రవితేజ కమిట్ అయిన ఏడు సినిమాల వివరాలు ప్రత్యేకంగా మీకోసం

మాస్ మహారాజా రవితేజ హీరోగా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.గతంలో రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమా లను చేసేవాడు.

 Raviteja Going To Do Seven Back To Back Movies Confirm , Anil Ravipudi, Khiladi,-TeluguStop.com

కాని వరుస ప్లాప్ ల కారణంగా ఆయన సినిమా ల సంఖ్య తగ్గించాడు.క్రాక్ సినిమా తో సక్సెస్‌ ట్రాక్ ఎక్కిన రవితేజ ఏకంగా ఏడు సినిమా లను లైన్ లో పెట్టాడు.

ఈమద్య కాలంలో ఒకే సారి ఇన్ని సినిమా లు చేయడం అంటే మామూలు విషయం కాదు.ఒక హీరో ఒక సమయంలో ఒకే సినిమా ను చేస్తున్నాడు.

ఒక సినిమా తర్వాత మరోటి అన్నట్లుగా జూనియర్‌ హీరోలు కొత్త హీరోలు స్టార్‌ హీరోలు వ్యవహరిస్తున్నారు.ఇలాంటి సమయంలో రవితేజ మాత్రం ఏకంగా ఏడు సినిమా లను లైన్ లో పెట్టడం హాట్‌ టాపిక్ అయ్యింది.

నెట్టింట ప్రస్తుతం రవితేజ సినిమా ల జాబిత వైరల్‌ అవుతోంది.

క్రాక్‌ సినిమా తర్వాత రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా మొదలు అయ్యింది.

ఖిలాడీ సినిమా చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో శరత్‌ మండవ దర్శకత్వం లో సినిమా కూడా పట్టాలెక్కింది.ఈ రెండు సినిమా లు ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటూ ఉన్నాయి.

ఇక ఈ రెండు సినిమా ల కంటే ముందే త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో ఒక సినిమా ను చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు.కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది.

ఆ సినిమా ఆలస్యం అవుతుంది తప్ప క్యాన్సిల్‌ కాలేదట.కనుక త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఈ మూడు సినిమా లు మాత్రమే కాకుండా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను ఈయన చేసేందుకు ఓకే చెప్పాడు.మంచు లక్ష్మి తో గతంలో దొంగాట సినిమా ను చేసిన వంశీ కృష్ణ తో ఒక సినిమా ను చేస్తాడట.

అనీల్ రావిపూడి తో కూడా రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తోంది.వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్‌ సక్సెస్‌ అయ్యింది.

కనుక మళ్లీ వీరు సినిమా చేసే అవకాశం ఉంది.ఇలా మొత్తంగా ఏడు సినిమా లను రవితేజ లైన్‌ లో పెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube