హీరోయిన్‌తో లిప్‌లాక్.. చిర్రెత్తిపోయిన మాస్ రాజా

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదిరిపోయే వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది.

 Raviteja Forced For Liplock In Khiladi-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఆయన పర్ఫార్మెన్స్ సినిమాకు అదిరిపోయే బలాన్ని అందించింది.కాగా రవితేజ నుండి పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ కోరిన అభిమానులకు క్రాక్ చిత్రం ఆ కోరికను నెరవేర్చిందని చెప్పాలి.

ఇక క్రాక్ అందించిన సక్సెస్ జోష్‌తో తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు రవితేజ.

 Raviteja Forced For Liplock In Khiladi-హీరోయిన్‌తో లిప్‌లాక్.. చిర్రెత్తిపోయిన మాస్ రాజా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు రమేశ్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి అనే సినిమాలో నటిస్తున్న రవితేజ, ఈ సినిమాలో డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఓ అదిరిపోయే హాట్ లిప్‌లాక్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే లిప్‌లాక్‌లో నటించేందుకు తొలుత రవితేజ అయిష్టం చూపెట్టినా, దర్శకుడు రమేశ్ వర్మ ఆయన్ను ఒప్పించడంతో, లిప్‌లాక్ సీన్‌కు రవితేజ ఓకే అనేశాడు.ఇక మీనాక్షి చౌదరితో చేసిన లిప్‌లాక్ చాలా సేపు ఉండబోతుందని, అది ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమా పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో రవితేజ తన యాక్టింగ్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేసి, ఈ సినిమాను కూడా అంతే త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఖిలాడి చిత్రంలో రవితేజ ఎలాంటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Khiladi #Liplock #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు