రాజా ది గ్రేట్ సీక్వెల్ పై దృష్టిపెట్టిన రవితేజ  

Raviteja Focus on Raja The Great Sequel, Tollywood, Telugu Cinema, Krack Movie, Anil Ravipudi, Khiladi Movie - Telugu Anil Ravipudi, Khiladi Movie, Krack Movie, Raja The Great Sequel, Raviteja, Telugu Cinema, Tollywood

మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథ పడితే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అనే మాట టాలీవుడ్ లో తరుచుగా వినిపిస్తుంది.అయితే కమర్షియల్ కొలతలు కరెక్ట్ గా తెలిసిన వారే రవితేజ ఎనర్జీని ఉపయోగించుకోగలరు.

TeluguStop.com - Raviteja Focus On Raja The Great Sequel

ఈ కారణంగానే కొత్తవాళ్లతో రవితేజ సినిమాలు చేసినపుడు ఎక్కువగా అంచనాలని అందుకోలేకపోయారు.సరైన కథ పడితే దానికి మరింత ఎనర్జీ తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ చేసే కెపాసిటీ రవితేజకి ఉంది.

ఈ విషయాన్ని క్రాక్ సినిమాతో మరోసారి మాస్ రాజా చేసి చూపించాడు.రాజా ది గ్రేట్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్ లు కొట్టిన రవితేజ మళ్ళీ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

TeluguStop.com - రాజా ది గ్రేట్ సీక్వెల్ పై దృష్టిపెట్టిన రవితేజ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ ఎఫెక్ట్ లో ఉన్న థియేటర్స్ కి, డిస్టిబ్యూటర్స్ కి క్రాక్ సినిమా కొంత ధైర్యాన్ని ఇచ్చింది.ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

ఇక క్రాక్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా అనిల్ రావిపూడి గెస్ట్ గా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ అనిల్ తో మరో సినిమా చేయాలని చెప్పాడు.దీనికి అనిల్ రావిపూడి కూడా ఒకే చెప్పడంతో వీరి కాంబినేషన్ లో మరో మూవీ రావడం పక్కా అని క్లారిటీ వచ్చింది.

అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.మరో వైపు రవితేజ కూడా రమేష్ వర్మ సినిమా తర్వాత ఇద్దరు దర్శకులని లైన్ లో పెట్టారు.వారితో మూవీస్ కంప్లీట్ అయ్యాక అనిల్, రవితేజ కాంబోలో సినిమా ఉండే అవకాశం ఉంది.

రాజా ది గ్రేట్ కి సీక్వెల్ కోసం కథ సిద్ధం చేయమని అనిల్ రావిపూడి కి రవితేజ చెప్పాడని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో అనిల్ కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నట్లు బోగట్టా.

#RajaThe #Anil Ravipudi #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు