కాన్సెప్ట్‌తో దిగిపోయిన డిస్కో రాజా టీజర్

మాస్‌రాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ఆడియెన్స్‌లలో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

 Raviteja Disco Raja Teaser Released-TeluguStop.com

కాగా తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ టీజర్ చూస్తే సినిమా కాన్సెప్ట్ ఏమిటో పూర్తిగా అర్ధమవుతోంది.

దర్శకుడు విఐ ఆనంద్ తన గత చిత్రాల లాగే ఈ సినిమాలో కూడా కొత్త పాయింట్‌ను టచ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే అది ఏమిటనేది మాత్రం సినిమా రిలీజ్ అయిన తరువాతే తెలుస్తుంది.

ఈ సినిమాలో రవితేజపై ఏదో ప్రయోగం చేస్తారు విలన్ బాబీ సింహా అండ్ గ్యాంగ్.ఆ ప్రయోగం విఫలించడంతో అసలు కథ నడుస్తుందని టీజర్ చూస్తే చెప్పేయొచ్చు.

ఈ సినిమాలో రవితేజ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనేది మాత్రం సస్పెన్స్‌గా పెట్టారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పూత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్‌టీ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube