సంక్రాంతి ఎఫెక్ట్.. డౌటే అంటోన్న డిస్కో రాజా  

Raviteja Disco Raja Release In Dilemma-disco Raja,raviteja,release,sarileru Neekevvaru

మాస్ రాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం డిస్కో రాజా అన్ని పనులు ముగించుకుని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Raviteja Disco Raja Release In Dilemma-Disco Raviteja Release Sarileru Neekevvaru

ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ తెరకెక్కించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర వర్గాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సంక్రాంతి బరిలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.

పండగ సెలవులు ముగిసినా ఈ సినిమాలు తమ జోరును కొనసాగిస్తూనే ఉన్నాయి.దీంతో ఇప్పట్లో ఈ చిత్రాలను థియేటర్ల నుండి తీసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపించడం లేదు.

ఇప్పుడు ఇదే అంశం డిస్కో రాజా పాలిట పెద్ద సమస్యగా మారింది.

జనవరి 24న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా కూడా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లలో ఆ రెండు సినిమాలను తీయకపోవడంతో, డిస్కో రాజాకు తక్కువ థియేటర్లు లభిస్తాయి.

ఇది ఖచ్చితంగా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది.సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా ఓపెనింగ్స్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

మరి ఈ సమస్యను డిస్కో రాజా ఎలా అధిగమిస్తాడో చూడాలి.

తాజా వార్తలు