డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్స్.. పర్వాలేదనిపించిన రవితేజ  

Raviteja Disco Raja 1st Day Collections-disco Raja,raviteja,telugu Movie News,vi Anand

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా మంచి అంచనాల నడుమ జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న మాస్ రాజా, ఔట్ ఆఫ్ ది బాక్స్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమాలో నటించాడు.

Raviteja Disco Raja 1st Day Collections-Disco Raviteja Telugu Movie News Vi Anand

ఈ సినిమా కథ చాలా వినూత్నంగా ఉంటుందంటూ చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వచ్చింది.

ఇక శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ లభించడంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది.తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ సినిమా రూ.2.51 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.సినీ వర్గాల ప్రకారం ఇది చాలా డీసెంట్ ఓపెనింగ్స్ అని తెలుస్తోంది.

సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు నటించారు.

థమన్ సంగీతం అందించిన ఈ సినిమా వీకెండ్ ముగిసే సరికి ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో అని చిత్ర వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.05 కోట్లు

సీడెడ్ – 0.36 కోట్లు

నెల్లూరు – 0.10 కోట్లు

కృష్ణా – 0.18 కోట్లు

గుంటూరు – 0.17 కోట్లు

వైజాగ్ – 0.31 కోట్లు

ఈస్ట్ – 0.19 కోట్లు

వెస్ట్ – 0.15 కోట్లు

టోటల్ ఏపీ + తెలంగాణ – 2.51 కోట్లు

తాజా వార్తలు

Raviteja Disco Raja 1st Day Collections-disco Raja,raviteja,telugu Movie News,vi Anand Related....