'ధమాకా' రికార్డ్ కలెక్షన్స్.. సంక్రాంతి వరకు మాస్ రాజా జోరు తగ్గేదేలే!

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’. ఈ సినిమా మొన్న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.

 Raviteja Dhamaka Mass Rampage At Box Office Details, Ravi Teja, Dhamaka Movie, S-TeluguStop.com

క్రిస్మస్ బరిలో చాలా సినిమాలే వచ్చిన ధమాకా మాత్రమే రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది.డిసెంబర్ 23న అరడజను సినిమాలు రాగ అన్ని కూడా అడ్రెస్ లేకుండా పోయాయి.

ఒక్క ధమాకా మాత్రం 10 రోజులు అవుతున్న కలెక్షన్స్ లో ఎక్కడ తగ్గడం లేదు.రవితేజ క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత రెండు భారీ డిజాస్టర్స్ ఎదుర్కున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ డిజాస్టర్స్ కు బదులు తీర్చుకుని రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తున్నాడు.ఈయనకు న్యూ ఇయర్ లాంగ్ వీకెండ్ కూడా బాగా కలిసి వచ్చింది.

మాస్ రాజా ధమాకా సినిమా 10 రోజుల్లో 89 కోట్లుగా తెలుస్తుంది.రవితేజ కెరీర్ లో ఈ కలెక్షన్స్ చాలా ఎక్కువ అనే చెప్పాలి.

మరి రవితేజ దూకుడు చూస్తుంటే సంక్రాంతి వరకు ఆగేలా కనిపించడం లేదు.

ఈ వారంలో కూడా పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు కూడా లేవు.సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ వసూళ్లు చేయడం ఖాయం.100 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

చూడాలి మరి రవితేజ ధమాకా సినిమాతో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాడో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube