రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈగల్ సినిమా( Eagle Movie 0 రిలీజ్ కు సరిగ్గా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది.ఇతర సినిమాలకు భిన్నంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
నెలరోజుల క్రితమే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా కొన్ని వారాల క్రితమే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా కార్తీక్ ఘట్టమనేని( Karthik Ghattamaneni ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో అనుపమ కార్తీక్ ఘట్టమనేని అన్నయ్య నా దగ్గరకు వచ్చి అని చెబుతుండగా రవితేజ వెంటనే అతడిని అన్నయ్య అని పిలుస్తావా? అని అనుపమను ప్రశ్నించారు.
ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేనితో కలిసి నేను చేస్తున్న నాలుగో సినిమా అని అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) చెప్పుకొచ్చారు.రవితేజ వెంటనే అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదమ్మా అని కామెంట్లు చేశారు.నేను ఎందుకు చెప్పానో ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంటూ రవితేజ( Raviteja ) అనుపమ గురించి కామెంట్లు చేశారు.
ఇది కార్తీక్ తో 4వ సినిమా అని అనుపమ మళ్లీ చెప్పగా అయితే మేమంతా అనుపమతో మూడు సినిమాలు చేసి ఆపేస్తామని అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న అవసరాల శ్రీనివాస్ అన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతూ ఉండటం గమనార్హం.ఈగల్ సినిమాతో అటు రవితేజకు, ఇటు అనుపమ పరమేశ్వరన్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈగల్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.ఈగల్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.ఈగల్ సినిమాకు పోటీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజవుతున్నాయి.