రవితేజ-రమేష్ వర్మ సినిమా ఆగలేదు… లాక్ డౌన్ తర్వాత గ్రాండ్ లాంచ్  

Raviteja And Ramesh Varma Movie Grand Launch After Lock Down - Telugu, South Cinema, Telugu Cinema, Tollywood

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.

 Raviteja And Ramesh Varma Movie Grand Launch After Lock Down

ఇక లాక్ డౌన్ తర్వాత మిగిలిన షూటింగ్ కూడా ఫినిష్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.వచ్చే నెల నుంచి షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపధ్యంలో దర్శకుడు సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రవితేజ ముగ్గురు దర్శకులని లైన్ లో పెట్టాడు.వారిలో రమేష్ వర్మ, త్రినాద్ రావు నక్కిన, వక్కంతం వంశీ ఉన్నారు.

రవితేజ-రమేష్ వర్మ సినిమా ఆగలేదు… లాక్ డౌన్ తర్వాత గ్రాండ్ లాంచ్-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులు గా రమేష్ వర్మ-రవితేజ సినిమా ఆగిపోయిందనే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా కథ రవితేజకి నచ్చక పోవడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అంటూ చర్చ నడిచింది.

అయితే ఈ సినిమాని నిర్మిస్తున్న కోనేరు సత్యనారాయణ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా ఆగిపోయిందని వస్తున్నా వార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు.లాక్ డౌన్ కారణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆపడం జరిగిందని తెలిపారు.లాక్ డౌన్ పూర్తికాగానే అఫీషియల్ గా సినిమాని ఎనౌన్స్ చేయడంతో గ్రాండ్ గా లాంచ్ చేస్తామని చెప్పారు.

కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ సినిమాని రవితేజ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raviteja And Ramesh Varma Movie Grand Launch After Lock Down Related Telugu News,Photos/Pics,Images..