లాక్ డౌన్ లో అనుభవాలు పంచుకున్న రవితేజ!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు తన అభిమానులకు నిరాశ మిగిలిస్తున్నాయని చెప్పవచ్చు.2017 లో విడుదల అయిన “రాజా ది గ్రేట్” సినిమా తరువాత మంచి విషయాన్ని అందుకోలేక సతమతమయ్యాడు ఈ మాస్ రాజా.ఈసారి ఎలాగైనా తన ఖాతాలో మంచి విజయం సొంతం చేసుకోవాలని కసితో “క్రాక్” సినిమాలో నటిస్తున్నారు ఈ హీరో.

 Krack Movie Hero Ravi Teja Shares Lockdown Experience,  Hero Ravi Teja , Krack M-TeluguStop.com

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న “క్రాక్” సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి తెలియజేశారు.ఇందులో భాగంగానే లాక్ డౌన్ సమయంలో ఎలా గడిపారని ప్రశ్నను అడగగా.

అందుకు రవితేజ లాక్ డౌన్ సమయంలో ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు.అంతేకాకుండా ఈ లాక్ డౌన్ సమయంలో చాలా నేర్చుకున్నానని తెలిపారు.

సాధారణంగా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే రవితేజ, అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని తన కుటుంబంతో బాగా గడిపానని తెలియజేశారు.

Telugu Bore, Ravi Teja, Krack, Krackravi, Lockdown, Lockdown Time, Raviteja, Tol

లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ, బోలెడన్ని సినిమాలను చూశాను.ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ ఒక్క నిమిషం కూడా బోర్ గా ఫీల్ అవ్వలేదని తెలియజేశారు.అయితే తన కొడుకు సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ… ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో దర్శకుడు అనిల్‌ పట్టుబట్టి మహాదన్‌తో ఆ పాత్ర చేయించాడు.

ప్రస్తుతం వాడు 9వ తరగతి మాత్రమే చదువుతున్నాడు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుందని అప్పటికీ తనకు ఏది తోచితే అదే చేయిస్తానని ఈ సందర్భంగా రవితేజ తెలిపారు.సంక్రాంతికి కానుకగా రాబోతున్న క్రాక్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను రవితేజ ఆకట్టుకుంటారో? లేదో? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు పాటు ఎదురు చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube